నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నవంబర్ 25న గచ్చిబౌలిలో మెగా జాబ్ మేళా

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నవంబర్ 25న గచ్చిబౌలిలో మెగా జాబ్ మేళా

హైదరాబాద్: ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో నవంబర్ 25న భారీ మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో ఐటీ, నాన్ ఐటీ రంగాలకు చెందిన 50కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులకు నేరుగా ఇంటర్వ్యూలు నిర్వహించి, ఎంపికైన వారికి అక్కడికక్కడే ఆఫర్ లెటర్లు అందించనున్నారు.

ఎక్కడ? ఎప్పుడు?

గచ్చిబౌలి టెలికాం నగర్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (MANUU) ఎదురుగా ఉన్న ఆరా కన్వెన్షన్ లాన్ గార్డెన్స్‌లో ఈ జాబ్ మేళా జరగనుంది. నవంబర్ 25న ఉదయం 8 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుంది. అభ్యర్థులు ముందుగానే చేరుకోవాలని నిర్వాహకులు సూచిస్తున్నారు.

10వ తరగతి నుంచి పీజీ వరకు అవకాశం

ఈ జాబ్ మేళాకు విద్యార్హతల పరంగా విస్తృత అవకాశాలు కల్పిస్తున్నారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు పాల్గొనవచ్చు. ఫ్రెషర్లతో పాటు గతంలో ఉద్యోగ అనుభవం ఉన్న అభ్యర్థులకు కూడా అవకాశం ఉంటుంది. ఏ సంవత్సరంలో ఉత్తీర్ణులయ్యారనే నిబంధన లేకుండా అభ్యర్థులు హాజరుకావచ్చని నిర్వాహకులు తెలిపారు.తెలంగాణలోని అన్ని జిల్లాల అభ్యర్థులతో పాటు పొరుగు రాష్ట్రాల నిరుద్యోగులు కూడా ఈ మేళాలో పాల్గొనవచ్చు.

ఐటీ, బ్యాంకింగ్ సహా పలు రంగాల్లో ఉద్యోగాలు

ఈ జాబ్ మేళాలో మార్కెటింగ్, బ్యాంకింగ్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, బీపీఓ (BPO), ఫైనాన్స్, మేనేజ్‌మెంట్ తదితర విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. కంపెనీల అవసరాలకు అనుగుణంగా అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఎంపిక ప్రక్రియ పూర్తయిన తర్వాత అర్హులైన వారికి అక్కడికక్కడే ఆఫర్ లెటర్లు అందించే అవకాశం ఉంది. వేతనాలు, ఇతర ప్రయోజనాలు కంపెనీల నిబంధనల ప్రకారం ఉంటాయి.

  • అభ్యర్థులు తీసుకెళ్లాల్సిన సర్టిఫికెట్లు
  • విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లు.
  • ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ.
  • కనీసం ఐదు సెట్ల రెజ్యూమ్ లు (Resume).
  • పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు.

ముందుగా ప్రాథమిక స్క్రీనింగ్ నిర్వహించి, అనంతరం కంపెనీల ప్రతినిధులు నేరుగా ఇంటర్వ్యూలు చేపడతారు. అభ్యర్థులు ఉదయం 8 గంటలకే చేరుకుంటే ఎక్కువ కంపెనీల ప్రతినిధులను కలిసే అవకాశం ఉంటుందని నిర్వాహకులు సూచించారు. జాబ్ మేళాకు సంబంధించిన ఇతర వివరాలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియపై సందేహాలు ఉన్నవారు 8374315052 నంబర్‌ను సంప్రదించవచ్చు.