హైదరాబాద్ లో TG SAFE అధికారులు నిర్వహించిన దాడుల్లో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. శనివారం ( నవంబర్ 21 ) హైదరాబాద్ లోని క్యూర్ పరిధిలో అధికారులు నిర్వహించిన ఈ దాడులకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి...క్యూర్ పరిధిలోని రెస్టారెంట్లు, హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు అధికారులు. మొత్తం 9 రెస్టారెంట్లు, హాస్టళ్లలో తనిఖీలు నిర్వహించగా..అడుగుడగునా నిర్లక్ష్యం, అపరిశుభ్ర వాతావరణం, నిబంధనల ఉల్లంఘన గుర్తించామని తెలిపారు అధికారులు.
పలు రెస్టారెంట్లు, హాస్టళ్లలోని వంట గదుల్లో బొద్దింకలు, ఈగలు, ఎలుకల మలం గుర్తించామని తెలిపారు అధికారులు. ఫ్రిజ్‌లలో వెజ్, నాన్‌వెజ్ ఆహార పదార్థాలను వేరు చేయకుండా ఉంచినట్లు తెలిపారుయ్ అధికారులు. వంట గదుల్లో జిడ్డుతో నిండిన చిమ్నీలు.. అపరిశుభ్ర గోడలు, నేలలు గుర్తించామని.. కొన్ని చోట్ల ఆహార పదార్థాల్లో సింథటిక్ ఫుడ్ కలర్స్ వినియోగిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు అధికారులు.
ఈ క్రమంలో కల్తీ అనుమానంతో 8 ఆహార నమూనాలు సేకరించామని... సుమారు 135 కిలోల ఆహార పదార్థాలు సీజ్ చేసి ధ్వంసం చేశామని తెలిపారు అధికారులు. FSSAI లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న రెండు సంస్థలు మూసివేశామని... మరో నాలుగు సంస్థలపై షోకాజ్ నోటీసులు జారీ చేశామని తెలిపారు అధికారులు.
