కార్తీక మాసం రెండో సోమవారం.. తిలదానం, దీప దానం చేస్తే జరిగేది ఇదే..!

కార్తీక మాసం రెండో సోమవారం.. తిలదానం, దీప దానం చేస్తే జరిగేది ఇదే..!

కార్తీకమాసం కొనసాగుతుంది.  శుక్లపక్షం ముగింపు దశకు వచ్చింది.  రెండో సోమవారం.. పౌర్ణమి ( నవంబర్​ 23,24) వరుసగా వచ్చాయి. రెండోరోజు నదీస్నానం.. దీపం... తిలదానం చాలా విశిష్టత ఉందని పండితులు చెబుతున్నారు.  

 కార్తీకమాసం రెండోసోమవారం ( నవంబర్​ 23)  ఉపవాసం వుంటే సర్వశుభాలు చేకూరుతాయి. కార్తీక పురాణ పారాయణం..  చదవడం... వినడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఇలా  చేయడం వలన పాపాలు పోవడమే కాకుండా..  పాపనాశం, మోక్ష ప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. కార్తీకమాసం రెండో  సోమవారం  చేసే జపాలు, దానాలు విశిష్ఠ ఫలితాలు కలుగుతాయి. ప్రదోషకాలంలో ( సాయంత్రం) ఆలయంలో కాని .. తులసి కోట దగ్గర దీపాలు వెలిగించాలి. 
 
కార్తీక రెండో సోమవారం ఏం చేయాలంటే..!

కార్తీక సోమవారం నాడు పగలంతా భోజనం చేయకుండా ఉపవాసం గడిపి సాయంత్రం వేళ శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనం అయ్యాక తులసీ తీర్థాన్ని మాత్రమే సేవించడం ఉపవాసంగా చెప్తారు. మంత్రాలు, జపాలు కూడా తెలియని వాళ్లు నువ్వులు దానం చేసినా సరిపోతుంది. దీన్నే తిలాదానం అంటారు. 

సూర్యోదయానికి ముందే నిద్రలేచి శివాలయానికి వెళ్లి శివునికి అభిషేకం చేసి ఉపవాసం ఉండాలి. సాయంత్రం ప్రదోషకాల సమయంలో ఇంటిలోని పూజ గదిలో దీపారాధన చేసి నక్షత్ర దర్శనం తర్వాత శివాలయనికి వెళ్లి పరమేశ్వరున్ని దర్శించుకుని దేవాలయంలో దీపారాధన చేయాలి. ఓం నమఃశివాయ పంచాక్షరి మంత్రాన్ని పఠించాలి.ఆ తర్వాత భోజనం చేసి ఉపవాస దీక్షను విరమించాలి.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.