గుండెపోటుతో బీజేపీ MP రామ్‌రావ్ వాడ్కుటే కన్నుమూత

గుండెపోటుతో బీజేపీ MP రామ్‌రావ్ వాడ్కుటే కన్నుమూత

న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, రాజ్య సభ ఎంపీ రామ్‎రావ్ వాడ్కుటే (72) గుండెపోటుతో కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్‎లో చికిత్స పొందుతూ శనివారం (నవంబర్ 21) తుదిశ్వాస విడిచారు. నవంబర్ 20వ తేదీ సాయంత్రం రామ్‎రావ్ అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పడంతో కుటుంబ సభ్యులు, వ్యక్తిగత సిబ్బంది ఆయనను హుటాహుటిన ఢిల్లీలోని ఎయిమ్స్‎కు తరలించారు. 

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో శనివారం (నవంబర్ 21) రాత్రి ఆయన మరణించారు. ఎంపీ రామ్‎రావ్ వాడ్కుటే మృతి పట్ల ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. రామ్‎రావ్ పార్థివదేహాన్ని సోమవారం (నవంబర్ 23) ప్రజల సందర్శనార్థం పర్భానిలో ఉంచి మంగళవారం (నవంబర్ 24) హింగోలిలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 

రామ్‎రావ్ వాడ్కుటే బ్యాగ్రౌండ్

మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతానికి చెందిన రామ్‎రావ్ వాడ్కుటే ధంగర్ సామాజిక వర్గంలో ప్రముఖ నాయకుడిగా గుర్తింపు పొందారు. గతంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ఆయన 2019లో ఆ పార్టీకి రాజీనామా చేశారు. అదే సంవత్సరం బీజేపీలో జాయిన్ అయ్యారు. 2014 జూన్ నుంచి అక్టోబర్ 2019 వరకు శాసన మండలి సభ్యునిగా పనిచేశారు. 2026, ఏప్రిల్‎లో బీజేపీ తరుఫున రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. రాజ్య సభ ఎంపీగా ఎన్నికైన ఎనిమిది నెలల్లోనే ఆయన మరణించడం విషాదకరం.