ప్రతి కుటుంబానికి సొంతిల్లు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎంత పేదవాడైనా ఆత్మగౌరవంగా బతికేందుకు తనకంటూ ఒక గూడు ఏర్పాడు కోవాలని చూస్తుంటాడు. అలాగే ఆ దంపతులు భావించారు. రూపాయి రూపాయి కూడబెట్టి ఇల్లు కొనేందుకు కొంత డబ్బు పోగుచేశారు. కానీ ఇద్దరి మధ్య వచ్చిన గొడవ కారణంగా తమ చిరకాల కోరికను మరిచి.. దాచిన డబ్బును బుగ్గిపాలు చేశారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో వెలుగు చూసింది ఈ విచిత్రమైన ఘటన.
భర్త మంజీత్ ధాకడ్ కోసం 22 వేల రూపాయలు వెచ్చించి ఒక సూట్ కొనుగోలు చేసింది భార్య. సూట్ కోసం రూ.22 వేలు ఖర్చుచేయాల్సిన అవసరం ఏంటని భర్త నిలదీశాడు. ఇల్లు కొనేందుకు నేను డబ్బులు జమ చేస్తుంటే.. నువ్వు వృథా చేస్తావా అంటూ భర్త ఆగ్రహం వ్యక్తం చేశాడు. దాంతో నొచ్చుకొని భార్య పుట్టింటికి వెళ్లిపోయింది.
డబ్బుల వల్లే తమ మధ్య గొడవ జరిగింది కాబట్టి వాటిని తగలబెట్టేస్తానని మంజీత్ బంధువులకు చెప్పాడు. అన్నట్లుగానే బ్యాంక్‌లో ఉన్న డబ్బులు తీసి.. 500 రూపాయల నోట్లను కాల్చేశాడు. ఒక్కొక్క నోటును తీసి నిప్పంటిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈగోలకు పోయి డబ్బును తగలబెట్టడం ఏంట్రా బాబూ అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
Burning Money 😡? 📉 A shocking incident caught on camera shows a youth setting ₹500 notes on fire. Utterly senseless and alarming behavior. https://t.co/a3j8CYrWey
— Aadya Tales (@AadyaTales) November 18, 2026
