బాలసాహిత్య పురస్కార విజేతలు వీరే
పార్వతీపురానికి చెందిన నారంశెట్టి బాలసాహిత్య పీఠం 2023 నుంచి 2026 సంవత్సరాలకు విజేతల పేర్లను ప్రకటించింది. బాలసాహితీ వేత్తలు బి. వి. పట్నాయక్, జొన్నలగడ్డ (జె) శ్యామలకు 2023, కూచిమంచి నాగేంద్ర, సంగనభట్ల చిన రామకిష్టయ్యలకు 2024, కాశీవిశ్వనాథం పట్రాయుడు, వడ్డేపల్లి వెంకటేశ్ లకు 2025, కిలపర్తి దాలినాయుడు, డా.అమ్మిన శ్రీనివాసరాజు లకు 2026 ఎంపికయ్యారు.
ఒక్కొక్కరికి ఆరు వేల రూపాయల నగదు పారితోషికంతో పాటు, జ్ఞాపిక, శాలువాతో త్వరలో నిర్వహించబోయే సభలో ప్రముఖుల చేతుల మీదుగా సత్కరిస్తారు. అదే రోజు కథల పోటీలో బహుమతి గ్రహీతలకు నగదు బహుమానంతో బాటు సత్కరిస్తారు. బాల సాహిత్య కథలు పంపడానికి ఆఖరు తేదీ నవంబరు 30 వరకు పొడిగించారు.
– నారంశెట్టి ఉమామహేశ్వరరావు, అధ్యక్షుడు, నారంశెట్టి బాలసాహిత్య పీఠం, పార్వతీపురం
