AI రంగంలో గూగుల్ సంచలనం.. Gemini 4 Neon లాంచ్!

AI రంగంలో గూగుల్ సంచలనం.. Gemini 4 Neon లాంచ్!

కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో గూగుల్ మరో ముందడుగు వేసింది. సంక్లిష్టమైన సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్ ఇంజినీరింగ్, నాలెడ్జ్ వర్క్, సైన్స్ వర్క్‌‌‌‌‌‌‌‌ఫ్లోల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘జెమిని 4 నియాన్’  అనే కొత్త మోడల్‌‌‌‌‌‌‌‌ను ఆవిష్కరించింది. బెంచ్‌‌‌‌‌‌‌‌మార్క్ పరీక్షల్లో ఆంత్రోపిక్ ‘క్లాడ్ ఓపస్ 5.5’, ఓపెన్ఏఐ ‘జీపీటీ-6.2 సోల్’ వంటి దిగ్గజ మోడళ్లను వెనక్కి నెట్టి నియాన్ టాప్​లో నిలిచింది. 1 మిలియన్ టోకెన్ల కాంటెక్స్ట్ విండోతో వస్తున్న ఈ మోడల్ ధర ప్రతి మిలియన్ ఇన్‌‌‌‌‌‌‌‌పుట్ టోకెన్‌‌‌‌‌‌‌‌లకు $3, అవుట్‌‌‌‌‌‌‌‌పుట్ టోకెన్‌‌‌‌‌‌‌‌లకు $15 గా ఉంది.

‘జెమిని 4 కార్బన్’ స్థాయి పటిష్టమైన భద్రతా ప్రమాణాలు ఇందులో ఉన్నాయి. గూగుల్ ఏఐ కుటుంబంలో ‘కార్బన్’ కష్టతరమైన ప్రాజెక్టులను, ‘హైడ్రోజన్’ వేగవంతమైన రోజువారీ పనులను చక్కబెడితే; ‘నియాన్’ తక్కువ ఖర్చుతో కూడిన లోతైన విశ్లేషణ, సామర్థ్యాన్ని అందిస్తుంది. సాధారణ వినియోగదారులు బిల్లింగ్ స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ల విశ్లేషణ, రసీదుల క్రాస్-చెకింగ్ వంటి పనులను దీనితో సులభంగా పూర్తి చేయవచ్చు. ప్రస్తుతం గూగుల్ ఏఐ స్టూడియోలోని ఏపీఐ ద్వారా, అలాగే బిజినెస్ యూజర్లు జెమిని ఫర్ బిజినెస్ ద్వారా దీన్ని వాడొచ్చు. గూగుల్ ఏఐ ప్రో, అల్ట్రా సబ్‌‌‌‌‌‌‌‌స్క్రైబర్లు ‘గూగుల్ యాంటీగ్రావిటీ’లోనూ, సాధారణ ప్రో/అల్ట్రా యూజర్లు నేరుగా జెమిని యాప్‌‌‌‌‌‌‌‌లోనూ నియాన్‌‌‌‌‌‌‌‌ను యాక్సెస్ చేయవచ్చు.