NPL లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు

NPL లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు

సీఎస్ఐఆర్–- నేషనల్ ఫిజికల్ లాబొరేటరీ 
(ఎన్​పీఎల్)లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఆఫ్​లైన్ ద్వారా డిసెంబర్ 23 వరకు అప్లై చేయవచ్చు. 
పోస్టు పేరు: మల్టీ టాస్కింగ్ స్టాఫ్. 

మొత్తం ఖాళీలు: 25.
విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి లేదా సమాన విద్యార్హత (ఐటీఐ) కలిగి ఉండాలి.
వయసు:18 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి. 

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వరకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్: ఆఫ్​లైన్ ద్వారా. కంట్రోలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, సీఎస్ఐఆర్ - నేషనల్ ఫిజికల్ లాబొరేటరీ, డాక్టర్ కె.ఎస్. కృష్ణన్ మార్గ్, పూసా న్యూఢిల్లీ - 110012 చిరునామాకు పోస్టు ద్వారా పంపించాలి. 

లాస్ట్ డేట్: డిసెంబర్ 23.
ఎంపిక విధానం: అభ్యర్థుల ఎంపిక రాత పరీక్ష/ స్కిల్ టెస్ట్ ఆధారంగా ఉంటుంది. ఇందులో మెంటల్ ఎబిలిటీ, జనరల్ అవేర్‌‌‌‌నెస్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. తుదిగా ఎంపికైన వారికి ధ్రవపత్రాల పరిశీలన 
నిర్వహించి నియామక పత్రాలు ఇస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్​సైట్ nplindia.inను సందర్శించండి.
- వెలుగు, ఎడ్యుకేషన్