స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సిడ్బీ) వివిధ విభాగాల్లో ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ స్వీకరణ ప్రక్రియ నవంబర్ 21న ప్రారంభం కాగా డిసెంబర్ 11 వరకు అప్లై చేయవచ్చు.
మొత్తం ఖాళీలు: 69.
విభాగాల వారీగా ఖాళీలు
అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్– ఏ (63 ఖాళీలు): జనరల్ 53, హిందీ 2, లీగల్ 3, సిస్టమ్స్/ ఐటీ 5.
మేనేజర్ గ్రేడ్–బీ (5 ఖాళీలు): హిందీ 1, లీగల్ 3, సిస్టమ్స్/ ఐటీ 1.
విద్యార్హతలు
జనరల్ స్ట్రీమ్: ఏదైనా విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ / ఎంబీఏ/ పీజీడీఎం/ సీఏ / సీఎస్ / సీఎంఏ పూర్తిచేసి ఉండాలి.
లీగల్: కనీసం 60 శాతం మార్కులతో లాలో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
సిస్టమ్స్ / ఐటీ: కంప్యూటర్ సైన్స్ / ఐటీ / ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్లో బీఈ / బి.టెక్ లేదా ఎంసీఏ పూర్తిచేసి ఉండాలి.
హిందీ: హిందీ ప్రధాన సబ్జెక్టుగా మాస్టర్స్ డిగ్రీ (డిగ్రీ స్థాయిలో ఇంగ్లిష్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి) లేదా ఇంగ్లిష్ మాస్టర్స్ డిగ్రీ (డిగ్రీలో హిందీ ఒక సబ్జెక్టుగా ఉండాలి) పూర్తిచేసి ఉండాలి.
రిజర్వేషన్ వర్తించే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు 50 శాతం మార్కులు సరిపోతాయి.
అసిస్టేంట్ మేనేజర్ గ్రేడ్– ఏ పోస్టులకు రెండేళ్లు, మేనేజర్ గ్రేడ్–బీ పోస్టులకు ఐదేళ్లు సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
వయసు
అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ -–ఏ పోస్టులకు 21 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి.
మేనేజర్ గ్రేడ్–బీ పోస్టులకు 25 నుంచి 33 ఏళ్ల మధ్యలో ఉండాలి.
కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: నవంబర్ 21.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీలు
రూ. 175, జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.1100 చెల్లించాలి.
లాస్ట్ డేట్: డిసెంబర్ 11.
సెలెక్షన్ ప్రాసెస్: ఫేజ్–Iలో ఆన్లైన్ స్క్రీనింగ్/ ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్, ఫేజ్–IIలో డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్, ఫేజ్–IIIలో ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.sidbi.inను సందర్శించండి.
పరీక్షా విధానం (ఫేజ్-1 & ఫేజ్-2)
ఫేజ్–-1, ఫేజ్–-2 పరీక్షలను ఒకే రోజు, ఒకే సిట్టింగ్లో నిర్వహిస్తారు.
అన్ని విభాగాలకు ఉమ్మడిగా ఉండే ఫేజ్–-1 పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో మొత్తం 60 మార్కులకు జరుగుతుంది. ఇందులో ఇంగ్లిష్ లాంగ్వేజ్, రీజనింగ్ ఆప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ (బ్యాంకింగ్, ఆర్థిక, సామాజిక అంశాలు & కంప్యూటర్ నాలెడ్జ్) విభాగాల నుంచి 15 చొప్పున మొత్తం 60 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 60 నిమిషాలు కాగా, ఒక్కో విభాగానికి 15 నిమిషాల చొప్పున సెక్షనల్ టైమింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల నెగటివ్ మార్కింగ్ వర్తిస్తుంది. ఇంగ్లిష్ మినహా మిగిలిన ప్రశ్నలు ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఉంటాయి. కేవలం అర్హత పరీక్ష మాత్రమే అయిన ఫేజ్-–1 మార్కులను తుది మెరిట్ జాబితాకు పరిగణనలోకి తీసుకోరు. సిడ్బీ నిర్దేశించిన కనీస అర్హత మార్కులతో ఫేజ్-–1లో ఉత్తీర్ణులైన అభ్యర్థుల ఫేజ్-–2 పేపర్లను మాత్రమే మూల్యాంకనం చేస్తారు.
- వెలుగు, ఎడ్యుకేషన్
