వైష్ణవ్ తేజ్ హీరోగా హనుమాన్ 2

వైష్ణవ్ తేజ్ హీరోగా హనుమాన్ 2

‘హనుమాన్’ యూనివర్స్ నుంచి మరో ఫాంటసీ సినిమా వస్తోంది. పంజా వైష్ణవ్ తేజ్ ఇందులో హీరోగా నటించబోతున్నాడు. ప్రైమ్‌‌షో ఎంటర్‌‌టైన్‌‌మెంట్ బ్యానర్‌‌‌‌పై ‘హనుమాన్‌‌’ చిత్రాన్ని నిర్మించిన  కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సీక్వెల్‌‌ను నిర్మిస్తున్నారు.

వి.ఐ. ఆనంద్ దర్శకత్వం వహించబోతున్నారు. శనివారం ఈ సినిమాను ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్‌‌మెంట్ పోస్టర్ సినిమాపై ఆసక్తి రేపుతోంది. 

గ్రాండ్ ఫాంటసీ ఎంటర్‌‌టైనర్‌‌గా ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయనుందని మేకర్స్‌‌ ఈ సందర్భంగా తెలియజేశారు. ఇతర నటీనటులు, టెక్నికల్ టీమ్ వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.

మరోవైపు ‘హనుమాన్‌‌’ దర్శకుడు ప్రశాంత్‌‌ వర్మ.. రిషబ్‌‌ శెట్టి లీడ్ రోల్‌‌లో మైత్రి బ్యానర్‌‌‌‌లో ‘జై హనుమాన్‌‌’ సినిమా ను ప్రకటించిన విషయం తెలిసిందే.