రష్మిక ‘మైసా’లో ఒసేయ్ రాములమ్మ పాట !

రష్మిక ‘మైసా’లో ఒసేయ్ రాములమ్మ పాట !

రష్మిక మందన్న లీడ్ రోల్‌‌లో రవీంద్ర పుల్లె తెరకెక్కిస్తున్న చిత్రం ‘మైసా’. అన్‌‌ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా కోసం ‘ఒసేయ్ రాములమ్మ’ చిత్రంలోని టైటిల్‌‌ సాంగ్‌‌ను రీ క్రియేట్‌‌ చేశారు. ఒరిజినల్ సాంగ్‌‌ను కంపోజ్ చేసిన వందేమాతరం శ్రీనివాస్, సాహిత్యం రాసిన డా.సుద్దాల అశోక్ తేజ ఈ కొత్త వెర్షన్ కోసం మరోసారి కలిశారు. జేక్స్ బిజోయ్ రీ-కంపోజ్ చేశారు.

శుక్రవారం ఈ సాంగ్ రిలీజ్‌‌ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌‌లో రష్మిక మందన్న మాట్లాడుతూ ‘ఐకానిక్‌‌ సాంగ్‌‌ను రీక్రియేట్ చేస్తున్నాం అనగానే చాలా భయమేసింది. అది చాలా పెద్ద బాధ్యత.  ఒరిజినల్‌‌ను ఎవరూ మ్యాచ్ చేయలేము. కానీ న్యాయం చేసేందుకు ప్రయత్నించాం. వందేమాతరం శ్రీనివాస్ గారే పాడటం, సుద్దాల అశోక్ తేజ గారు సాహిత్యం రాయడం సంతోషం. విజయశాంతి గారికి ఈ పాట చిన్న ట్రిబ్యూట్.

అప్పట్లో ‘ఒసేయ్ రాములమ్మ’ విజయం హిస్టరీ క్రియేట్ చేసింది. ఇప్పుడు కూడా అదే స్థాయి ప్రేమను అందరిస్తారని ఆశిస్తున్నాం. నవంబర్ 27న థియేటర్స్‌‌లో కలుద్దాం’ అని చెప్పారు.  సుద్దాల అశోక్ తేజ, వందేమాతరం శ్రీనివాస్  దర్శకుడు రవీంద్ర పుల్లె సహా టీమ్ పాల్గొన్నారు.