ఓఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంట పచ్చదనానికి శుద్ధి జలాలు.. రోజుకు 600 కిలో లీటర్ల నీటి సరఫరా

ఓఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంట పచ్చదనానికి శుద్ధి జలాలు.. రోజుకు 600 కిలో లీటర్ల నీటి సరఫరా
  • హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీసీబీ - హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎండీఏ భాగస్వామ్యంతో ప్రత్యేక కార్యక్రమం
  • రోజుకు 600 కిలో లీటర్ల నీటి సరఫరా

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిటీ, వెలుగు: నగరంలో జల సంరక్షణ, పచ్చదనం పెంపొందించేందుకు హిందుస్థాన్ కోకా-కోలా బెవరేజెస్ (హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీసీబీ), హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎండీఏ భాగస్వామ్యంతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టాయి. మేడ్చల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాంతంలోని ఓఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంట మొక్కల పెంపకం, హరిత ప్రాంతాల నిర్వహణకు హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీసీబీ తన అవెన్యూ ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి రోజుకు గరిష్ఠంగా 600 కిలో లీటర్ల శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయనుంది. 

నాణ్యతా పరీక్షలు, భద్రతా ప్రమాణాల అనంతరం ట్యాంకర్ల ద్వారా హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎండీఏ నిర్దేశించిన కేంద్రానికి తరలించి, నీటిపారుదల వ్యవస్థల ద్వారా మొక్కలకు అందిస్తారు. దీనివల్ల తాగునీటి వనరులపై ఒత్తిడి తగ్గడంతోపాటు నీటి పునర్వినియోగం పెరుగుతుందని హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎండీఏ ఫారెస్ట్ విభాగం డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గోపిడి తెలిపారు.