సెల్ టవర్ కాపర్ వైర్ చోరీ.. మంచిర్యాల జిల్లాలో నిలిచిన బీఎస్ఎన్ఎల్ సేవలు

సెల్ టవర్ కాపర్ వైర్ చోరీ.. మంచిర్యాల జిల్లాలో నిలిచిన బీఎస్ఎన్ఎల్ సేవలు

జన్నారం, వెలుగు :  సెల్​ టవర్​కాపర్ వైర్ చోరీకి గురికావడంతో 12 గంటల పాటు బీఎస్ఎన్ఎల్ సేవలు  నిలిచిపోయిన ఘటన మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో జరిగింది. శనివారం రాత్రి జన్నారం మండల కేంద్రంలోని బీఎస్ఎన్ఎల్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఆఫీస్ లో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి బ్యాటరీలకు కనెక్షన్ ఉన్న కాపర్ వైర్ ను ఎత్తికెళ్లిపోయారు. 

దీంతో మండల ఉన్న 3 వేల మంది మొబైల్ వినియోగదారులతో పాటు 270  ప్రభుత్వ, ప్రైవేట్  ఆఫీస్ ల్లో ఆదివారం మధ్యాహ్నం వరకు ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. విషయం తెలియగానే బీఎస్ఎన్ఎల్ మంచిర్యాల డీఈ దాసరి ప్రకాశ్, లక్సెట్టిపేట జేటీఓ కొత్త రాజేశ్ ఆఫీస్ కు చేరుకొని  పునరుద్ధరణ పనులు  చేపట్టి ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి తెచ్చారు. కాగా, చోరీకి గురైన కాపర్ వైర్ల విలువ సుమారు రూ.40 వేల వరకు ఉంటుందని ఆఫీసర్లు పేర్కొన్నారు.