ఆముదం గింజలు తిని ఆరుగురు విద్యార్థులకు అస్వస్థత

ఆముదం గింజలు తిని ఆరుగురు విద్యార్థులకు అస్వస్థత

ఆదిలాబాద్ టౌన్, వెలుగు : ఆముదం గింజలు తిని ఆరుగురు విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన ఆదిలాబాద్​ జిల్లా గాదిగూడ మండలంలోని లోకారి గ్రామంలో  జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన పెందూర్ అభిమన్ (6), సి.ఇందుబాయి (6), దుర్గాబాయి (4), ధనుష్ (5), జంగు (5), పల్లవి (3) శుక్రవారం స్కూల్ నుంచి వస్తుండగా ఓ ఆముదం చెట్టు కింద పడి ఉన్న కాయలను పగలగొట్టి అందులోని గింజలు తిన్నారు. 

శనివారం ఉదయం నిద్రలేవగానే కడుపునొప్పి, కండ్లు తిరుగుతున్నాయని పేరెంట్స్​తో చెప్పారు. ఏమైనా తిన్నారా అని వారిని తల్లిదండ్రులు ఆరా తీయగా ముందురోజు ఆముదం చెట్టు కింద పడిన కాయలు తిన్న విషయాన్ని చెప్పారు. దీంతో వెంటనే వారిని స్థానిక హాస్పిటల్ కు, అక్కడి నుంచి రిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది