తిమ్మాపూర్(మానకొండూర్), వెలుగు : వితంతు పింఛన్ కోసం లంచం తీసకుంటూ ఓ పంచాయతీ కార్యదర్శి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. వివరాళ్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం లక్ష్మీపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి చవన్ లాల్వితంతు పింఛన్ మంజూరు చేసేందుకు ఓ బాధిత కుటుంబ నుంచి రూ.10వేలు లంచం డిమాండ్ చేశాడు.
దీంతో బాధిత కుటుంబం ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. శనివారం బాధితురాలి ఇంటికి వచ్చిన చవన్లాల్నగదు రూపంలో రూ.10 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు కరీంనగర్ ఏసీబీ అధికారి చెప్పారు. ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
