గంగాధర, వెలుగు : కరీంనగర్ జిల్లా గంగాధర మండలం రంగారావుపల్లికి చెందిన దోమకొండ శంకరమ్మ అనుమానాస్పద స్థితిలో మృతిచెందగా, ఆమె మృతదేహాన్ని పోలీసులు 12 రోజుల తర్వాత వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. శంకరమ్మ ఈ నెల 8న రాత్రి మృతిచెందింది. కుటుంబసభ్యులు మరుసటి రోజు అంత్యక్రియలు నిర్వహించారు.
కాగా, మృతురాలి చిన్నమ్మ శంకరమ్మ మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఈనెల 20న గంగాధర పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఖననం చేసిన మృతదేహాన్ని శనివారం వెలికితీయించి తహసీల్దార్ అంబటి రజిత సమక్షంలో పోస్టుమార్టం చేయించారు. నివేదిక వచ్చిన తర్వాత శంకరమ్మ మృతికి గల కారణాలు తెలుస్తాయని, ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వంశీకృష్ణ తెలిపారు.
