హైదరాబాద్, వెలుగు: తెలంగాణ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీఎంఎస్ఐడీసీ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బి. గంగాధర్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో గ్రేడ్-–2 మున్సిపల్ కమిషనర్‌గా పనిచేస్తున్నారు.
ఆయన్ను ఏడాది పాటు ఫారిన్ సర్వీస్ డిప్యుటేషన్‌పై హైదరాబాద్‌లోని టీజీఎంఎస్‌ఐడీసీలో పోస్టింగ్ ఇస్తూ రాష్ట్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ జీవో జారీ చేసింది. ఈ నియామకంపై తదుపరి చర్యలు తీసుకోవాలని టీజీఎంఎస్ఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్‌ను, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.
