సుందర్ పిచాయ్ చదువుకున్న విద్యాసంస్థకు.. గూగుల్ రూ.46 కోట్ల విరాళం సాయం

 సుందర్ పిచాయ్ చదువుకున్న విద్యాసంస్థకు..  గూగుల్ రూ.46 కోట్ల విరాళం సాయం

న్యూఢిల్లీ:  టెక్ దిగ్గజం గూగుల్  తమ సీఈఓ సుందర్ పిచాయ్ చదువుకున్న  విద్యాసంస్థ ఐఐటీ ఖరగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 5 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 46 కోట్లు) నిధులను అందిస్తున్నట్లు శనివారం ప్రకటించింది. ఐఐటీ ఖరగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్ ప్లాటినం జూబ్లీ వేడుకల సందర్భంగా, ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో గూగుల్ ఈ కీలక ప్రకటన చేసింది. భారతీయ భాషలు, వ్యవసాయం, విద్యా రంగాల్లో ఐఐటీ ఖరగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్ అద్భుతమైన పరిశోధనలు చేస్తోందని సుందర్ పిచాయ్ కొనియాడారు. 

 ఏఐ ఫలాలు దేశంలోని ప్రతి ఒక్కరికీ చేరాలన్న ప్రధాని మోదీ ఆశయానికి ఈ భాగస్వామ్యం ఊతమిస్తుందని పేర్కొన్నారు. ఈ నిధులను భారతీయ భాషలు, మెటీరియల్ సైన్స్, వ్యవసాయం, ఎడ్యుకేషన్ టెక్నాలజీ రంగాల్లో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించే ఏఐ పరిశోధనలకు వినియోగిస్తారు. అలాగే విద్యార్థులు, అధ్యాపకులకు ఏఐ శిక్షణ, కరిక్యులమ్ అభివృద్ధి, సంస్థ ఏఐ మౌలిక సదుపాయాల బలోపేతానికి ఖర్చు చేస్తారు.   గూగుల్ గతంలో ఐఐటీ కాన్పూర్, మద్రాస్, పంజాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు 8 మిలియన్ డాలర్లు ఇచ్చింది.