హైదరాబాద్, వెలుగు: ఇండియన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐఈఈఎంఏ) వచ్చే ఏడాది ఫిబ్రవరి 20–24 మధ్య నోయిడాలో ఎలక్ట్రామా-2027 ప్రదర్శన నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో రోడ్‌షో నిర్వహించి, ప్రాంతీయ విద్యుత్ పరికరాల తయారీపై చర్చించింది.
ఈ ప్రదర్శనలో 1,100కి పైగా ఎగ్జిబిటర్లు, 10 దేశాల ప్రత్యేక పెవీలియన్లు పాల్గొంటాయి. 25 వేలకు పైగా బీ2బీ సమావేశాలు నిర్వహించి, 25 బిలియన్ డాలర్ల విలువైన వ్యాపార అవకాశాలు సృష్టించాలన్నది సంస్థ లక్ష్యం. 500 మందికి పైగా అంతర్జాతీయ కొనుగోలుదారులు, 5 లక్షలకు పైగా సందర్శకులు వస్తారని అంచనా. భారత విద్యుత్ పరిశ్రమ విలువ 90 బిలియన్ డాలర్లని అసోసియేషన్ తెలిపింది.
