ఉద్యమకారుల రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేక వెబ్‌‌ సైట్!

ఉద్యమకారుల రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేక వెబ్‌‌ సైట్!
  •     మంత్రి పొన్నం నివాసంలో కేకే, కోదండరాం సమాలోచనలు
  •     త్వరలోనే పోర్టల్​ప్రారంభ తేదీ, కార్యాచరణ ప్రకటిస్తాం

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన అసలైన ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను మరింత స్పీడప్​ చేయాలని, అర్హులందరికీ న్యాయం జరిగేలా పక్కా కార్యాచరణను పూర్తి చేయాలని ‘తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ’ నిర్ణయించింది. శనివావారం హైదరాబాద్ మినిస్టర్స్ క్వార్టర్స్‌‌లోని మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో కమిటీ చైర్మన్ కె. కేశవరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి పొన్నంతో పాటు ఎమ్మెల్సీ కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, కమిటీ సభ్యులు మోతే శోభన్ రెడ్డి, శ్యాం మోహన్ పాల్గొన్నారు. 

రాష్ట్రవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాల ఉద్యమకారులు, ఉద్యమ కళాకారులు, సబ్బండ వర్గాల ప్రతినిధులతో కమిటీ ఇప్పటివరకు జరిపిన సంప్రదింపులను సమీక్షించారు. గుర్తింపు ప్రక్రియలో ఇంకా చేపట్టాల్సిన చర్యలపై సమగ్రంగా చర్చించారు. ఉద్యమకారుల నుంచి దరఖాస్తులు, సమగ్ర వివరాల సేకరణకు ప్రత్యేక వెబ్‌‌సైట్ ప్రారంభించాలనే అంశాలపై సమాలోచనలు జరిగాయి. అతి త్వరలోనే మరోమారు సమావేశమై పోర్టల్ ప్రారంభ తేదీతో పాటు తదుపరి కార్యాచరణను అధికారికంగా ప్రకటిస్తామని కమిటీ స్పష్టం చేసింది.