హైదరాబాద్, వెలుగు: రియల్ ఎస్టేట్ సంస్థ మ్యాక్ ప్రాజెక్ట్స్ దక్షిణ హైదరాబాద్‌లో లగ్జరీ గేటెడ్ విల్లా ప్రాజెక్ట్ మ్యాక్ ఫెర్న్ను ప్రారంభించింది. తుక్కుగూడ సమీపంలో15 ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ చేపట్టింది. ఇందులో 109 నాలుగు పడక గదుల జీ+2 విల్లాలు నిర్మించనున్నారు.
312 నుంచి 427 చదరపు గజాల ప్లాట్ విస్తీర్ణం, సుమారు 4,525 చదరపు అడుగుల బిల్ట్-అప్ ఏరియాతో ఇళ్లను కడతారు. ఇంపోర్టెడ్ మార్బుల్ ఫ్లోరింగ్, వెట్-డ్రై కిచెన్లు, క్లబ్‌హౌస్‌లో స్విమ్మింగ్ పూల్, ఫిట్నెస్ స్టూడియో, ఇండోర్ బ్యాడ్మింటన్, స్క్వాష్ కోర్టులు, లైబ్రరీ, కేఫ్ వంటి సదుపాయాలు ఉంటాయి.
