స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్కు రూ. 2 కోట్ల జరిమానా..

స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్కు రూ. 2 కోట్ల జరిమానా..
  • నిబంధనలు ఉల్లంఘించడంతో ఐఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఏఐ చర్యలు

న్యూఢిల్లీ: నిబంధనలను ఉల్లంఘించినందుకు హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై  రెగ్యులేటరీ సంస్థ ఐఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఏఐ  మొత్తం రూ. 2 కోట్ల జరిమానా విధించింది. 2022 జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 మధ్య నిర్వహించిన తనిఖీల్లో వెలుగుచూసిన అంశాల ఆధారంగా  ఈ ఆదేశాలు జారీ చేసింది. 

పాలసీ నిబంధనలకు విరుద్ధంగా క్లెయిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను పరిష్కరించడం, కొవిడ్ క్లెయిమ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు రూ. కోటి జరిమానా విధించింది. క్లెయిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో ఏకపక్షంగా కోతలు విధించడం, క్లెయిమ్ రిజెక్ట్‌‌‌‌ చేయడానికి గల కారణాలను పాలసీదారులకు తెలియజేయకపోవడంపై మరో రూ. కోటి పెనాల్టీ వేసింది. సరైన కారణం లేకుండా క్లెయిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను తిరస్కరించొద్దని ఆదేశించింది.