బుడాపెస్ట్: తెలంగాణ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఎరిగైసి.. టోటల్ చెస్ వరల్డ్ చాంపియన్‌షిప్ టూర్ పైలట్ టోర్నీలో పదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. తొమ్మిదో ప్లేస్ కోసం శనివారం జరిగిన పోరులో అర్జున్ 9–11తో హాయిక్ మార్టిరోస్యాన్ (అర్మేనియా) చేతిలో ఓడాడు. బ్లిట్జ్, ర్యాపిడ్ గేమ్‌ల్లో ఆధిక్యం సాధించినా.. కీలకమైన ఫాస్ట్ క్లాసిక్ గేమ్‌లో అర్జున్ ఓటమిపాలయ్యాడు. 21వ స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో ఆర్. ప్రజ్ఞానంద 15–5తో అభిమన్యు మిశ్రాపై గెలిచాడు.
బ్లిట్జ్‌లో 3–1తో నెగ్గిన ప్రజ్ఞా.. ర్యాపిడ్ గేమ్‌లను డ్రా చేసుకుని ఫ్లాస్ట్ క్లాసిక్ గేమ్‌లో 38 ఎత్తుల వద్ద విజయం సాధించాడు. ఆర్. వైశాలి.. నొడిర్బెక్ అబ్దుసత్తారోవ్ చేతిలో అన్ని గేమ్‌లు ఓడిపోయి 24వ స్థానంలో నిలిచింది. ఇక ఫ్రాన్స్ గ్రాండ్‌మాస్టర్ అలీరెజా ఫిరౌజా.. ఈ టోర్నీ చాంపియన్‌గా నిలిచాడు. తొలి రోజు అనిష్ గిరి చేతిలో 9–11తో ఓడిన అలీరెజా రెండో రోజు 12–8 తేడాతో గెలవడంతో మ్యాచ్ ఆర్మగెడాన్‌కు వెళ్లింది. ఇందులో అలీరెజా విజయం సాధించాడు.
