Indian Test Squad: వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు తుది జట్టు నుంచి పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) ను తప్పించడంపై కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ (Imran Masood) చేసిన మత వివక్ష ఆరోపణలు సొంత పార్టీలోనే తీవ్ర దుమారం రేపాయి. మసూద్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ రంజిత్ రంజన్ (Ranjeet Ranjan) ఈరోజు (నవంబర్ 21, శనివారం) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. క్రీడలు, రాజకీయాలను వేరుగా ఉంచాలని, ఆటగాళ్లను రాజకీయ చర్చల్లోకి లాగడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆమె స్పష్టం చేసింది.
క్రీడల్లో రాజకీయ జోక్యం వద్దు:
మీడియాతో రంజీత్ రంజన్ మాట్లాడుతూ.. ఇమ్రాన్ మసూద్ వ్యాఖ్యలను తప్పుబడుతూ కీలక సూచనలు చేశారు. క్రీడలు, రాజకీయాలను వేరుగా ఉంచాలని నేను మసూద్ జీని కోరుతున్నాను.. దయచేసి క్రీడల్లో మనం జోక్యం చేసుకోవద్దు.. క్రీడలకు సొంత పరిధి, ప్రతిభను అంచనా వేసే సొంత కొలమానాలు ఉంటాయి.. ప్రతి ఆటగాడికి తనదైన కష్టం ఉంటుంది.. మనం రాజకీయ వ్యూహాలు నడపొచ్చు కానీ, క్రీడలను లేదా ఆటగాళ్లను మన రాజకీయ చర్చల్లోకి లాగడం పూర్తిగా ఆమోదయోగ్యం కాదని రంజిత్ రంజన్ తేల్చి చెప్పారు.
షమీ, సర్ఫరాజ్ పేర్లు ఎందుకు తెచ్చారు:
అంతకుముందు ఇమ్రాన్ మసూద్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. సిరాజ్‌తో పాటు మహ్మద్ షమీ, సర్ఫరాజ్ ఖాన్ పేర్లను కూడా ప్రస్తావిస్తూ, సంచలన ఆరోపణలు చేశారు. మహ్మద్ షమీ ఉన్నాడు, సర్ఫరాజ్ ఉన్నాడు, ఇంకా ఎందరో ఉన్నారు.. ఎంపికలు అనేవి ప్రదర్శన ఆధారంగా జరగుతాయి.. ఒక ఆటగాడు బాగా రాణిస్తున్నప్పుడు అతడు ఎక్కడి నుంచి వచ్చాడనేది ముఖ్యం కాదంటూ టీమిండియా సెలక్షన్ ప్రక్రియపై మసూద్ ప్రశ్నలు లేవనెత్తారు.
WTCలో టాప్ వికెట్ టేకర్.. సిరాజ్‌కు దక్కని ఛాన్స్:
ప్రస్తుత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) సైకిల్‌లో 11 మ్యాచ్‌ల్లో 43 వికెట్లతో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్న సిరాజ్‌ను వెల్లింగ్టన్ టెస్టు నుంచి తప్పించడం క్రీడా వర్గాల్లోనూ చర్చకు దారితీసింది. గతేడాది ఇంగ్లండ్‌లోని ఓవల్ టెస్టు తర్వాత ఆసియా పిచ్‌లపై ఆడిన 7 టెస్టుల్లోనూ సిరాజ్ 21.28 సగటుతో 21 వికెట్లు తీశాడు. కానీ, వెల్లింగ్టన్ పిచ్ పరిస్థితులు, బౌలింగ్ కాంబినేషన్, ఎక్ట్స్రా బ్యాటింగ్ కవర్ కోసం జట్టు మేనేజ్‌మెంట్ జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అన్షుల్ కాంబోజ్‌లతో పాటు వాషింగ్టన్ సుందర్‌ను సెలక్ట్ చేసింది.
#WATCH | Delhi: On Congress MP Imran Masood alleging discrimination against cricketer Mohammed Siraj following his omission from the Indian Test squad, Congress Rajya Sabha MP Ranjeet Ranjan says, "...I would simply urge Masood-ji to keep politics and sports separate; please, let us not interfere in sports. Sports has its own domain, its own criteria for merit, and every player has their own unique struggle. I strongly believe that while we may engage in political manoeuvring, we should not drag sports or athletes into our political discourse. I find that completely unacceptable..."
— ANI (@ANI) November 21, 2026
#WATCH | Delhi: On Cricketer Mohammed Siraj, Congress MP Imran Masood says, "It is being said that despite his good performance, he was not given a place in the team. His name is 'Siraj ', and that is why he was not given a place. If you are not selecting him despite his good performance, the discrimination is clear."
— ANI (@ANI) November 20, 2026
