జైస్వాల్‌కే దిక్కులేదు.. సూర్యకుమార్ యాదవ్ను ఎక్కడ ఆడించాలి..?

జైస్వాల్‌కే దిక్కులేదు.. సూర్యకుమార్ యాదవ్ను ఎక్కడ ఆడించాలి..?

Suryakumar Yadav: టీమిండియా (Team India)లో మళ్లీ అడుగుపెట్టాలనే కసితో దేశవాళీ క్రికెట్‌లో పరుగుల సునామీ సృష్టిస్తున్న మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) కు BCCI సెలెక్షన్ కమిటీ నుంచి ఊహించని షాక్ ఇచ్చింది. సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ (SMAT) లో ముంబై జట్టుకు నాయకత్వం వహిస్తూ కేవలం 3 ఇన్నింగ్స్‌ల్లోనే 269.35 స్ట్రైక్ రేట్‌తో 167 పరుగులు బాదినప్పటికీ, ప్రస్తుతానికి సూర్య తమ సెలెక్షన్ ప్లాన్స్‌లో లేడని బీసీసీఐ వర్గాలు కుండబద్దలు కొట్టాయి. అంతేకాదు, యశస్వీ జైస్వాల్ పేరును ప్రస్తావిస్తూ సెలెక్టర్లు చెప్పిన కారణం ఇప్పుడు టీమిండియా క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

జైస్వాల్‌కే దిక్కులేదు.. సూర్యను ఎక్కడ ఆడిస్తాం?: 

* మాజీ భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రీఎంట్రీపై ఏఎన్ఐ (ANI) వార్తా సంస్థతో మాట్లాడిన బీసీసీఐ కీలక అధికారి ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. 

* జట్టులో ఖాళీ లేదు: సూర్య ప్రస్తుతానికి మా సెలెక్షన్ ప్లాన్స్‌లో లేడు.. అతడు దేశవాళీ క్రికెట్‌లో చాలా కష్టపడుతున్నాడు, అద్భుతంగా రాణిస్తున్నాడు. కానీ ప్రస్తుత భారత జట్టులో అతడిని ఎక్కడ సర్దుబాటు చేయాలనేది అసలు ప్రశ్న అని సదరు అధికారి పేర్కొన్నారు.

* జైస్వాల్ ఉదాహరణ: వైట్-బాల్ క్రికెట్‌లో యశస్వీ జైస్వాల్ లాంటి యువ స్టార్ ఆటగాడికే మేము ఇంకా తుది జట్టులో చోటు కల్పించలేకపోతున్నాం.. అలాంటప్పుడు ప్రస్తుత జట్టు కాంబినేషన్‌లో సూర్య ఎక్కడ సరిపోతాడు? ప్రస్తుత పరిస్థితుల్లో అతడిని జాతీయ జట్టులోకి తీసుకునే ఆలోచనే లేదని బోర్డు వర్గాలు స్పష్టం చేశాయి.

సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో సూర్య విధ్వంసం: 

* జాతీయ జట్టు నుంచి తప్పించిన తర్వాత ఏమాత్రం నిరాశ చెందకుండా సూర్యకుమార్ తన బ్యాట్‌తోనే సమాధానం చెబుతున్నాడు. 

* కేవలం 3 ఇన్నింగ్స్‌ల్లో 167 రన్స్: సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో ముంబై కెప్టెన్‌గా బరిలోకి దిగిన సూర్య, ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోస్తున్నాడు.

* 269.35 భీకర స్ట్రైక్ రేట్: ఈ 3 ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా 15 సిక్సర్లు, 16 ఫోర్లు బాది తనలో ఇంకా ఎంత ఫైర్ మిగిలి ఉందో సెలెక్టర్లకు చూపించాడు.

వరల్డ్ కప్ గెలిపించిన కెప్టెన్‌పై వేటు: 

స్వదేశంలో జరిగిన 2026 టీ20 ప్రపంచకప్ ని భారత్‌కు అందించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. ఈ విజయం తర్వాత తాను ఆటను కొనసాగిస్తానని, 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ (LA Olympics) లో టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించాలని ఉందని సూర్య తన మనసులోని కోరికను బయటపెట్టాడు. కానీ సెలెక్టర్లు భిన్నమైన వ్యూహంతో సూర్యను కెప్టెన్సీతో పాటు జట్టు నుంచే తప్పించేశారు. 2023 డిసెంబర్ తర్వాత ఒక్క టీ20 కూడా ఆడని శ్రేయస్ అయ్యర్ ను తిరిగి తీసుకొచ్చి, ఏకంగా 2028 టీ20 ప్రపంచకప్ వరకు కెప్టెన్‌గా నియమించారు. కాగా, సూర్యకుమార్ త్వరలో ప్రారంభమయ్యే విజయ్ హజారే ట్రోఫీలోనూ ముంబైని నడిపించబోతున్నాడు. అలాగే IPL 2027 కోసం ముంబై ఇండియన్స్ (MI) అతడిని రిటైన్ చేసుకుంది.