క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ (Sara Tendulkar) పెళ్లి వార్త మరోసారి సోషల్ మీడియాలో తుఫాను సృష్టిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ కుమారుడు, యంగ్ యాక్టర్ రాజ్‌వీర్ డియోల్ (Rajveer Deol) తో సారా వివాహం జరగబోతోందంటూ నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ 2027లో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ గత రెండు రోజులుగా కొన్ని పోస్టులు వైరల్ కావడంతో, క్రీడా, సినీ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ మొదలైంది. అసలు ఈ పెళ్లి పుకార్లు ఎలా స్టార్ట్ అయ్యాయి? వీటి వెనుక ఉన్న అసలు నిజమేంటో ఇక్కడ తెలుసుకుందాం..
సారా, రాజ్‌వీర్ పెళ్లి ప్రచారం:
* ఎక్స్ (X), రెడ్డిట్ పోస్టులు: @Bhumika_2026 అనే ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో చేసిన ఒక పోస్ట్ ఈ చర్చకు ఆజ్యం పోసింది. రాజ్‌వీర్ డియోల్, సారా టెండూల్కర్‌కు ఖరీదైన గిఫ్ట్స్ ఇస్తున్నారని, 2027 నాటికి వీరిద్దరి పెళ్లి జరిగే అవకాశం ఉందని అందులో పేర్కొన్నారు. ఇదే తరహా చర్చలు రెడ్డిట్ (Reddit) వేదికల్లోనూ వైరల్ అయ్యాయి.
* పార్టీలో పరిచయం.. పెళ్లి చర్చలు?: మరోవైపు రాహుల్ గుప్తా అనే యూజర్ చేసిన పోస్ట్ ప్రకారం.. సన్నీ డియోల్ టీమ్‌కు చెందిన ఒక ప్రత్యేక వ్యక్తి ఈ విషయాన్ని వెల్లడించినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఒక పార్టీలో రాజ్‌వీర్, సారా కలుసుకున్నారని, ఆ పరిచయం అనంతరం ఇరు కుటుంబాల మధ్య పెళ్లి చర్చలు ప్రారంభమయ్యాయని ఆ పోస్టులో రాసుకొచ్చారు.
అసలు నిజమేంటి? ఇరు ఫ్యామిలీస్ రియాక్షన్:
ఈ వార్త నిజమైతే భారతదేశంలోని రెండు అత్యంత ప్రతిష్టాత్మక కుటుంబాలు (క్రికెట్ దిగ్గజం టెండూల్కర్ కుటుంబం, బాలీవుడ్ లెజెండ్ ధర్మేంద్ర - సన్నీ డియోల్ కుటుంబం) ఒకటి కానున్నాయి. దేశంలోనే అత్యధికంగా చర్చించుకునే సెలబ్రిటీ వివాహాలలో ఇదొకటిగా నిలుస్తుందని నెటిజన్లు జోరుగా కామెంట్లు చేస్తున్నారు. కానీ, సచిన్ టెండూల్కర్ ఫ్యామిలీ గానీ, సన్నీ డియోల్ కుటుంబం గానీ ఈ వార్తలపై ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేరు. ప్రస్తుతానికి ఇవి కేవలం సోషల్ మీడియా ఊహాగానాలు (Rumours) మాత్రమేనని సినీ, క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి.
BIGGEST EXCLUSIVE: 🚨 #RajveerDeol & #SaraTendulkar Wedding Talks CONFIRMED! #SunnyDeol 's son Rajveer Deol and Sachin Tendulkar's daughter Sara Tendulkar are making headlines, and this could be one of the biggest celebrity stories! A very special source from Sunny Deol's team exclusively revealed to me that Rajveer and Sara met at a party, and ever since that meeting, talks about their marriage have reportedly started. If this relationship moves forward, it could bring two of India's most iconic families together, making it one of the most talked-about celebrity weddings! Rajveer Deol & Sara Tendulkar - Are we about to witness a BIG Bollywood wedding?
— Rahul Gupta (@RahulGupta25376) November 20, 2026
Sara Tendulkar is leaving Shubman Gill behind and is going to marry Sunny Deol's son, Rajveer Deol. Sara Tendulkar's family was worried about her marriage because even at the age of 30, Sara is still unmarried. Sara has had five affairs with big names from Bollywood to cricket world.....1/2
— BHUMI (@Bhumika_2026) November 20, 2026
The most talked about person on social media these days is Sachin Tendulkar's daughter Sara Tendulkar. It is true that Sara Tendulkar is 30 years old and of marriageable age but that does not mean that you will just spread rumours. Sara Tendulkar will marry Shubman Gill, believe it or not. But...1/2
— Subhajit Das (@SantaniSubhajit) November 21, 2026
