LSG New Captain: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 (IPL 2027) సీజన్‌కు ముందు లక్నో సూపర్ జెయింట్స్ (LSG) కొత్త కెప్టెన్ వేటపై కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది. మినీ వేలానికి ముందే జరిగిన సంచలన ట్రేడ్ డీల్‌లో రిషభ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు వెళ్లిపోవడంతో లక్నో సారథి స్థానం ఖాళీ అయింది. జట్టుకు తొలి ఐపీఎల్ టైటిల్ అందించగల నాయకుడి కోసం మేనేజ్‌మెంట్ కసరత్తు చేస్తున్న వేళ, LSG యువ స్పిన్నర్ దిగ్వేశ్ రాఠీ (Digvesh Rathi) ఇచ్చిన ఒక హింట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
దిగ్వేశ్ రాఠీ లీక్ చేసిన పేరు ఇదే:
IPL 2027 ట్రేడ్ విండోలో భాగంగా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ను జట్టులోకి తీసుకునేందుకు లక్నో సూపర్ జెయింట్స్ తమ కెప్టెన్ రిషభ్ పంత్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌కు అప్పగించింది. దీంతో కొత్త కెప్టెన్ ఎవరనే ఉత్కంఠ నెలకొంది. తాజాగా ఇండోర్ వేదికగా ఢిల్లీతో జరిగిన సయ్యద్ ముష్తాక్ అలీ టీ20 ట్రోఫీ మ్యాచ్ సందర్భంగా, LSG కొత్త కెప్టెన్ ఎవరని అభిమానులు దిగ్వేశ్ రాఠీని ప్రశ్నించారు. దీనికి అతడు ఏమాత్రం తడుముకోకుండా నికోలస్ పూరన్ (Nicholas Pooran) పేరు చెప్పడంతో ఆ వీడియో క్షణాల్లో వైరల్ అయింది.
నికోలస్ పూరన్‌కే కెప్టెన్సీ ఎందుకంటే:
* IPL 2027 కోసం లక్నో సూపర్ జెయింట్స్ ఈ వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్‌ను రూ. 21 కోట్లకు రిటైన్ చేసుకుంది. జట్టుతో పూరన్‌కు ఉన్న సుదీర్ఘ అనుబంధం, గణాంకాలు కూడా అతడికే కెప్టెన్సీ దక్కే అవకాశాలను బలపరుస్తున్నాయి.
* 2023 నుంచి జట్టుకు వెన్నెముక: 2023 సీజన్ నుంచి లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న పూరన్, 2025 మెగా వేలానికి ముందు కూడా రూ. 21 కోట్లకు రిటైన్ అయ్యాడు.
* LSG ఆల్-టైమ్ టాప్ స్కోరర్: ఐపీఎల్‌లో లక్నో తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా పూరన్ రికార్డు సృష్టించాడు. LSG జెర్సీలో ఇప్పటి వరకు 57 మ్యాచ్‌ల్లో (57 ఇన్నింగ్స్) ఏకంగా 1,615 పరుగులు బాదాడు.
* నాయకత్వ అనుభవం: అంతర్జాతీయ స్థాయిలో వెస్టిండీస్ జట్టుకు, వివిధ టీ20 లీగ్‌లలో ఫ్రాంచైజీలకు కెప్టెన్‌గా పని చేసిన అనుభవం నికోలస్ పూరన్ సొంతం.
When Digvesh Rathi says “Pooran” after being asked about LSG’s next captain 👀 LSG fans’ reaction: 😭😭 https://t.co/YUBEMKyGEW
— Super Giants Army (@LSGFansClub) November 19, 2026
