వీళ్లు పిల్లలా.. రాక్షసులా.. ముంబైలో మైనర్ గ్యాంగ్ వీరంగం.. జంటపై కర్రలు, రాళ్లతో దాడి

వీళ్లు పిల్లలా.. రాక్షసులా.. ముంబైలో మైనర్ గ్యాంగ్ వీరంగం.. జంటపై కర్రలు, రాళ్లతో దాడి

ఏంటీ దారుణం.. అంతా 15 ఏళ్ల లోపు పిల్లలే.. చేతిలో కర్రలు, రాళ్లు.. రోడ్డున పోతున్న ఓ జంటను విచక్షణా రహితంగా కొట్టారు. ముక్కు మొహం చూడకుండా పిడిగుద్దులు, కర్రలతో దాడి చేశారు.  ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఆ గ్యాంగ్ లో ఆరేళ్ల చిన్న పిల్లాడు ఉండటం.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ముంబైలోని కుర్లా  ప్రాంతంలో ఓ జంటపై మైనర్ గ్యాంగ్ దాడికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ పిల్లల పోకడపై ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.  

వైరల్ అవుతున్న వీడియలో ముంబైలోని కుర్లా వెస్ట్‌లో ఉన్న ఫీనిక్స్ మార్కెట్‌సిటీ మాల్ సమీపంలోని ప్రమోద్ మహాజన్ గార్డెన్‌లో కొందరు మైనర్లు ఒక జంటపై దాడి చేసినట్లు వీడియో పుటేజ్ లో స్పష్టంగా కనిపిస్తోంది. అందులో జంటను కర్రలు, రాళ్లతో  మైనర్లు దాడి చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ ఫుటేజ్ సోషల్ మీడియాలోకి రావడం, పోలీసుల జోక్యం కోరుతూ ప్రజలకు విజ్ఞప్తి చేయడంతో మైనర్ గ్యాంగ్ కు చెందిన 8మంది పిల్లల్లపై ఎఫ్ ఐఆర నమోదు చేసినట్లు తెలుస్తోంది. 

ఓ పార్కులో ఉన్న జంట దగ్గర కొందరు  మైనర్లు గుంపుగా రావడం వీడియో కనిపిస్తోంది.  వారిమధ్య మాటల యుద్దం మొదలైంది. మాటలు ముదిరి దాడికి దారి తీసింది. మైనర్లలో ఒకడు యువకుడిని కర్రతో కొట్టడం మొదలుపెట్టారు. అడ్డుకున్న మహిళపై కూడా దాడి చేశారు. మహిళను కొడుతుంటే అడ్డుపోగా మరోసారి యువకుడిపై గుంపు విరుచుపడింది. పిడిగుద్దులతో అతని మోహం పగలగొట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో  చర్చకు దారి తీశాయి. ఈ మూక దాడిలో ఆ జంటకు తీవ్ర గాయాలయ్యాయి. 

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను షేర్ చేసిన వ్యక్తి ముంబై పోలీస్, ఘట్‌కోపర్ పోలీస్‌ను ఉద్దేశించి, అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ పోస్ట్ షేర్ చేశారు. ముంబైలోని ఫీనిక్స్ మార్కెట్‌సిటీ సమీపంలోని ప్రమోద్ మహాజన్ గార్డెన్ లో ఈ ఘటనజరిగినట్లు  తెలుస్తోంది. ఇందులో ప్రమేయం ఉన్నవారిని గుర్తించాలని, సమీపంలోని సీసీటీవీ చెక్ చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆ విజ్ఞప్తి కోరింది.

8 మంది పిల్లలపై ఎఫ్ఐఆర్ నమోదు..

ఈ ఘటనలో నిందితులైన 8మంది పిల్లలపై కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని  ఓ బీజేపీ నేత సోషల్ మీడియాలో  పోస్ట్ షేర్ చేశారు. ఆ పిల్లలలో ఐదుగురి తల్లిదండ్రులకు కూడా నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఈ ఘటనతో మారుతున్న పిల్లల ప్రవర్తనపై సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.