- రోడ్ల పరిస్థితిని అంచనా వేసే కొత్త టెక్నాలజీ
- ఐపేవ్కు సీఆర్ఆర్ఐ ధ్రువీకరణ
హైదరాబాద్, వెలుగు: దేశంలోని రోడ్ల నాణ్యతను అంచనా వేసేందుకు కొత్త టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. ఆస్ట్రేలియాకు చెందిన ఏఆర్ఆర్బీ సిస్టమ్స్ భారత విభాగం రూపొందించిన ఇంటెలిజెంట్ పేవ్మెంట్ అసెస్మెంట్ వెహికల్ (ఐపేవ్)కు సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఆర్ఆర్ఐ) ధ్రువీకరణ లభించింది. ఐపేవ్లో నెట్వర్క్ సర్వే వెహికల్ (ఎన్ఎస్వీ), ట్రాఫిక్ స్పీడ్ డిఫ్లెక్టోమీటర్ (టీఎస్డీ), గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (జీపీఆర్) టెక్నాలజీలను కలిపారు. ఎన్ఎస్వీ రోడ్డు పైపొర పరిస్థితులను పరిశీలిస్తే, టీడీఎస్ వాహనాల బరువుతో రోడ్డుపై కలిగే ప్రభావాన్ని అంచనా వేస్తుంది. జీపీఆర్ రాడార్ సాయంతో రోడ్డు లోపలి పొరల నిర్మాణాన్ని గుర్తిస్తుంది. సాధారణంగా ఈ పరీక్షలకు వేర్వేరు పరికరాలు అవసరం. ఐపేవ్తో ఒకే వాహనంలో సమగ్ర సర్వే చేయవచ్చు.
