- హైదరాబాద్ బేగల్ బ్రిగేడ్కు గోల్డ్ మెడల్
హైదరాబాద్, వెలుగు: ఫుడ్, బెవరేజెస్ సేవలు అందించే హైదరాబాద్ స్టార్టప్ బేగల్ బ్రిగేడ్ అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటింది. న్యూయార్క్లో నవంబర్ 15న జరిగిన బేగల్ఫెస్ట్ 2026లో బెస్ట్ ఇంటర్నేషనల్ విభాగంలో గోల్డ్ మెడల్ గెలుచుకుంది. బటర్ చికెన్, చికెన్ టిక్కా వంటి భారతీయ వంటకాలతో బేగల్ శాండ్విచ్లను తయారు చేయడం ఈ బ్రాండ్ ప్రత్యేకత. తందూరీ, పుదీనా చట్నీ రుచుల్లో క్రీమ్ చీజ్ స్ప్రెడ్స్ను కూడా అందిస్తోంది. భారత్తో పాటు అమెరికాలోని ఆస్టిన్లోనూ కార్యకలాపాలు సాగిస్తున్న సంస్థ, మరిన్ని అంతర్జాతీయ మార్కెట్లకు విస్తరించాలని చూస్తోంది.
