పెళ్లి పీటలెక్కబోతున్న శివ కందుకూరి

పెళ్లి పీటలెక్కబోతున్న శివ కందుకూరి

ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి కుమారుడు, హీరో శివ కందుకూరి  ఈ ఏడాది డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నాడు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు చెందిన ఆర్కిటెక్ట్ శిశిర సింహాను ఆయన పెళ్లాడనున్నాడు. ఇరు కుటుంబాలు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరగనుంది.

 చూసీ చూడంగానే, మను చరిత్ర, భూతద్ధం భాస్కర్ నారాయణ లాంటి చిత్రాలతో గుర్తింపు పొందిన శివ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. కాబోయే వధూవరులకు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు