దృశ్యం ఫేమ్ ఎస్తేర్ అనిల్ బాలీవుడ్ ఎంట్రీ

దృశ్యం ఫేమ్ ఎస్తేర్ అనిల్ బాలీవుడ్ ఎంట్రీ

‘దృశ్యం’ చిత్రంలో వెంకటేష్ చిన్నకూతురిగా మెప్పించిన ఎస్తేర్ అనిల్.. ఇప్పుడు హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా బాలీవుడ్‌‌‌‌‌‌‌‌ సినిమా చేస్తోంది. మూవీ టైటిల్‌‌‌‌‌‌‌‌తో పాటు ఫస్ట్ లుక్‌‌‌‌‌‌‌‌ను శుక్రవారం విడుదల చేశారు. ‘అన్‌‌‌‌‌‌‌‌ఎక్స్‌‌‌‌‌‌‌‌పెక్టెడ్ – సఫేద్ సచ్’ అనే పేరుతో రూపొందుతున్న ఈ  క్రైమ్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్,  దర్శకుడు ‘గరుడవేగ’ అంజి డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా బాలీవుడ్‌‌‌‌‌‌‌‌లోకి అడుగుపెడుతున్నారు. 

యశ్ వీరా ఫిల్మ్స్ సమర్పణలో ప్యారేలాల్ గుండెచా నిర్మిస్తున్నారు.  డెహ్రాడూన్ బస్ టెర్మినల్ వద్ద జరిగిన ఓ రియల్‌‌‌‌‌‌‌‌ క్రైమ్ ఇన్సిడెంట్‌‌‌‌‌‌‌‌ ఆధారంగా దీన్ని రూపొందిస్తున్నారు. ఇంట్లో జరిగిన అపార్థంతో అర్ధరాత్రి బస్సు ఎక్కి అదృశ్యమైన ఓ టీనేజ్ యువతికి ఎదురైన చేదు అనుభవం ఏమిటి.. ?  ఆసుపత్రిలో అపస్మారక స్థితిలో చేరిన ఆమె కేసును పోలీసు అధికారి ఎలా ఛేదించారు..? అనే అంశాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. 

సంజయ్ కపూర్ పోలీస్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్నారు. తెలుగు నటుడు పృథ్వీ, తమిళ నటుడు తంబి రామయ్య ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మహిళా భద్రత, సామాజిక బాధ్యతను ప్రశ్నించేలా ఈ చిత్రం ఉంటుందని మేకర్స్‌‌‌‌‌‌‌‌ తెలియజేశారు. వచ్చే ఏడాది తెలుగు, హిందీ సహా తొమ్మిది భాషల్లో విడుదల కానుంది.