హైదరాబాద్, వెలుగు: తెలంగాణ కేవలం స్టార్టప్‌లను సృష్టించే రాష్ట్రంగా కాకుండా, అంతర్జాతీయ మార్కెట్లలో పోటీపడగలిగే ప్రపంచ స్థాయి వ్యాపార సంస్థలను నిర్మించే కేంద్రంగా ఎదగాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆకాంక్షించారు. శుక్రవారం హెచ్ఐసీసీలో జరిగిన హైదరాబాద్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమిట్‌లో ఆయన జెనీవా నుంచి వర్చువల్‌గా ప్రసంగించారు. ప్రభుత్వం కంపెనీలను సృష్టించలేదని, అవి ఎదగడానికి అనుకూల వాతావరణాన్ని మాత్రమే కల్పిస్తుందని స్పష్టం చేశారు.
ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, ప్రతిభావంతులు ఉన్న హైదరాబాద్ అవకాశాల నగరమని సీఎస్ సంజయ్ జాజు అన్నారు. మూసీ రివర్ ఫ్రంట్, రీజినల్ రింగ్ రోడ్, భారత్ ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా 9 రంగాల్లో 'టై డిస్టింక్టివ్ అవార్డులు' ప్రదానం చేశారు. రాష్ట్రంలోని 50 అత్యుత్తమ స్టార్టప్‌ల రిపోర్ట్ 'టై50 తెలంగాణ 2026'ను ఆవిష్కరించారు. 2,000 మందికి పైగా పారిశ్రామికవేత్తలు ఈ సదస్సులో పాల్గొన్నారు.
