కరీంనగర్ జిల్లాలో అర్ధరాత్రి కొండచిలువ కలకలం.. కిచెన్ గోడపై మాటువేసి..

కరీంనగర్ జిల్లాలో అర్ధరాత్రి కొండచిలువ కలకలం.. కిచెన్ గోడపై మాటువేసి..

కరీంనగర్ జిల్లాలో అర్ధరాత్రి కొండ చిలువ కలకలం రేపింది. కిటికీ నుంచి ఇంట్లోకి ప్రవేశించి.. గోడపై మాటు వేసిన వీడియో వైరల్ గా మారింది.  2026 నవంబర్ 21న హుజురాబాద్ మండలం సిర్సపల్లిలో అర్ధరాత్రి కొండచిలువ ఆడెపు రాజమల్లు ఇంట్లోకి రావడంతో భయాందోళనకు గురయ్యారు.  

గోడకు అతుక్కుని ఎవరైనా వస్తే దాడి చేద్దామా అన్నట్లు కనిపించిన పెద్దపామును చూసి కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే 100కు ఫోన్ చేశారు. సమాచారం అందుకున్న బ్లూకోట్ పోలీసులు అనిల్, రాజేందర్ ప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకుని స్నేక్ క్యాచర్ అఫ్జల్ కు సమాచారం అందించారు.

వెంటనే అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ కొండచిలువను పట్టుకుని బయటకు తీసుకెళ్లడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. గోడపై మాటు వేసి ఉన్న పామును కుటుంబ సభ్యులు చూడటంతో ప్రమాదం తప్పినట్లు చెబుతున్నారు.