కవిత ఆరోపణలకు బీఆర్ఎస్ సమాధానం చెప్పాలి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

కవిత ఆరోపణలకు బీఆర్ఎస్ సమాధానం చెప్పాలి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

కోరుట్ల, వెలుగు: పదేండ్ల కాలంలో బీఆర్ఎస్ పాలనపై టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత చేస్తున్న ఆరోపణలకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ముందుగా సమాధానం చెప్పాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సవాల్​ విసిరారు. శుక్రవారం జగిత్యాల జిల్లా మెట్‌‌‌‌‌‌‌‌పల్లిలో కోరుట్ల నియోజకవర్గానికి కొత్తగా మంజూరైన చేయూత పింఛన్​ మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదలకు అండగా నిలవాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట సభలో ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రారంభించారని తెలిపారు. ప్రజా ప్రభుత్వానికి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

కోరుట్ల నియోజకవర్గంలో కొత్తగా 3,737 చేయూత పింఛన్లు మంజూరు చేసినట్లు తెలిపారు. నియోజకవర్గంలో ఇప్పటికే 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, త్వరలో మరో 2 వేల ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని 70 గ్రామాలతో పాటు కోరుట్ల, మెట్‌‌‌‌‌‌‌‌పల్లి మున్సిపాలిటీల అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి ప్రత్యేక నిధులు తీసుకొస్తామని తెలిపారు. కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, వెలమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగరావు, కలెక్టర్ సత్యప్రసాద్, ఆర్డీవో జీవాకర్ రెడ్డి, డీఆర్‌‌‌‌‌‌‌‌డీవో రఘువరన్, ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.