వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు కోసం పోటీ పడుతున్న 3 ఫ్రాంచైజీలు.. త్వరలోనే బిగ్ డీల్? 

వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు కోసం పోటీ పడుతున్న 3 ఫ్రాంచైజీలు.. త్వరలోనే బిగ్ డీల్? 

ఐపీఎల్ 2027 (IPL 2027) మినీ వేలానికి ముందు భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ సెహ్వాగ్ (Aryaveer Sehwag) హాట్ టాపిక్‌గా మారాడు. ఇటీవల ముగిసిన అండర్-19 ఆసియా కప్ 2026 (U19 Asia Cup 2026) టోర్నీలో 19 ఏళ్ల ఆర్యవీర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఏకంగా 361 రన్స్ తో టోర్నమెంట్ టాప్ స్కోరర్‌గా నిలవడమే కాకుండా, ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డును కైవసం చేసుకున్నాడు. తండ్రి తరహాలోనే విధ్వంసక బ్యాటింగ్‌తో అదరగొట్టిన ఆర్యవీర్ వేలంలోకి వస్తే, అతడిని దక్కించుకోవడానికి 3 ప్రధాన ఫ్రాంచైజీలు పోటీపడే ఛాన్స్ ఉంది. 

అండర్-19 ఆసియా కప్ 2026లో ఆర్యవీర్ విధ్వంసం: 

టోర్నమెంట్ ఆసాంతం నిలకడగా రాణించిన ఆర్యవీర్ సెహ్వాగ్, వరుసగా 5 మ్యాచ్‌ల్లో 70, 22, 160, 51, 58* పరుగులతో (ఒక సెంచరీ, 3 హాఫ్ సెంచరీలు) సత్తా చాటాడు. ముఖ్యంగా యూఏఈపై 160 పరుగుల సెంచరీ బాదిన ఆర్యవీర్, ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై 58 రన్స్ చేసి ఇండియన్ టీమ్ ఛాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఒకవేళ ఆర్యవీర్ ఐపీఎల్ 2027 మినీ వేలంలో పేరు నమోదు చేసుకుంటే, ఫ్రాంచైజీల షార్ట్‌లిస్ట్‌లో నెంబర్ స్థానంలో ఉండటం ఖాయం.

ఆర్యవీర్ సెహ్వాగ్ కోసం పోటీ పడే ఐపీఎల్ జట్లు ఇవే: 

* ముంబై ఇండియన్స్ (MI): ముంబై జట్టుకు ప్రస్తుతం ఒక మంచి భారత ఓపెనర్ అవసరం ఉంది. రోహిత్ శర్మకు తోడుగా విదేశీ ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ ఆడుతున్నాడు. ఆర్యవీర్ సెహ్వాగ్‌ను తీసుకుంటే, ఓపెనర్‌గా ఆడించి తుది జట్టులో ఒక అదనపు విదేశీ బౌలర్‌ను ఆడించే ఛాన్స్ ముంబైకి దక్కుతుంది. రోహిత్ కెరీర్ చివరి దశలో ఉండటంతో ఆర్యవీర్ భవిష్యత్ స్టార్‌గా మారతాడు.

►ALSO READ | LSG కొత్త కెప్టెన్ ఫిక్స్.. పంత్ ప్లేస్లో రూ. 21 కోట్ల ఆటగాడికి జట్టు పగ్గాలు.. 

* రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB): డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్‌సీబీకి కూడా ఒక యంగ్ ఇండియన్ ఓపెనర్ అవసరం ఉంది. జట్టు దగ్గర పర్స్ వాల్యూ తక్కువగా ఉన్నాయి. తక్కువ ధరలో దొరికే ప్రతిభావంతుడైన ఆర్యవీర్‌ను కొనుగోలు చేస్తే మంచి డీల్ అవుతుంది. ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీలకు బ్యాకప్ ఓపెనర్‌గా ఆర్యవీర్ ఉండనున్నాడు. 

* కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR): అజింక్యా రహానే రిటైర్మెంట్ నేపథ్యంలో కేకేఆర్ జట్టుకు ఒక స్టార్ ఇండియన్ ఓపెనర్ కావాల్సి ఉంది. దూకుడైన ఆట తీరు ఉన్న ఆర్యవీర్ సెహ్వాగ్‌ను వేలంలో దక్కించుకుంటే కోల్‌కతా టాప్ ఆర్డర్ మరింత స్ట్రాంగ్ అవుతుంది.