హైదరాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం.. అర్ధరాత్రి డివైడర్ను ఢీకొట్టిన బైక్.. ఇద్దరు మృతి

హైదరాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం.. అర్ధరాత్రి డివైడర్ను ఢీకొట్టిన బైక్.. ఇద్దరు మృతి

ఉప్పల్‌ భగాయత్‌ హెచ్‌ఎండీఏ లేఅవుట్‌ పరిధిలో అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన బైక్ డివైడర్ ను ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. 2026 నవంబర్ 20న (శుక్రవారం ) అర్ధరాత్రి  వేగంగా వెళ్తున్న ద్విచక్రవాహనం అదుపుతప్పి డివైడర్‌పై ఉన్న విద్యుత్‌ స్తంభం దిమ్మెను బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

 సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న మహ్మద్‌ మునాజిర్‌ (34) తన యమహా ఎఫ్‌జెడ్‌ బైక్ పై ఉప్పల్‌ భగాయత్‌ హెచ్‌ఎండీఏ లేఅవుట్‌ నుంచి నాగోల్‌ వైపు బయలుదేరాడు. మార్గమధ్యంలోని శ్రీపూజ గ్లాస్‌ హార్డ్‌వేర్‌ దుకాణం ఎదురుగా బైక్‌ అదుపుతప్పి డివైడర్‌పై ఉన్న విద్యుత్‌ స్తంభం దిమ్మెను ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో బైక్‌ నడుపుతున్న మహ్మద్‌ మునాజిర్‌తో పాటు వెనుక కూర్చున్న మహ్మద్‌ సలావుద్దీన్‌ (35) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు.

మృతుల్లో ఒకరైన మహ్మద్‌ సలావుద్దీన్‌ గుజరాత్‌ రాష్ట్రంలోని భరూచ్‌కు చెందిన కార్మికుడు. ప్రస్తుతం ఉప్పల్‌ భగాయత్‌లోని జైన్‌ భవన్‌లో నివాసం ఉంటున్నట్లు సమాచారం.ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.