మియాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం..పెయింట్ షాప్‌లో ఎగిసిపడుతున్న మంటలు

మియాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం..పెయింట్ షాప్‌లో ఎగిసిపడుతున్న మంటలు

హైదరాబా లోని  మియాపూర్ న్యూ హఫీజ్‌పేటలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ పెయింట్ షాప్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగి భారీగా ఎగిసిపడుతున్నాయి. మంటలను గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పెయింట్ షాప్‌లో అగ్నిప్రమాదం జరగడంతో పరిసర ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది.

మంటలు ఎగిసిపడటంతో ఘటనాస్థలి వద్ద రోడ్డుపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు, నష్టం వివరాలు తెలియాల్సి ఉంది