టీమిండియా యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ (Sarfaraz Khan) తన కెరీర్‌లో ఎదుర్కొన్న చేదు అనుభవాలను, మానసిక వేదనను తాజాగా బయట పెట్టాడు. దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారించినా జాతీయ జట్టు తరపున ఆడేందుకు ఛాన్సులు రాకపోవడం, దానికి తోడు గతంలో తనపై వచ్చిన డ్రెస్సింగ్ రూమ్ లీక్ (Dressing Room Leak) ఆరోపణలు తనను, తన కుటుంబాన్ని తీవ్రంగా కుంగదీశాయన్నాడు. మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా నిర్వహిస్తున్న 'బైఠ్ ఔర్ బోల్' కార్యక్రమంలో పాల్గొన్న సర్ఫరాజ్.. ఆ వివాదం వేళ తనకు దగ్గరగా ఉన్నవాళ్లు కూడా ఫోన్లు ఎత్తలేదు, కానీ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం ఫోన్ చేసి అండగా నిలిచారని సర్ఫరాజ్ పేర్కొన్నాడు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీతో లీక్ ప్రచారం:
* బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సమయంలో గాయపడి నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో కోలుకుంటున్న సమయంలోనే తనపై డ్రెస్సింగ్ రూమ్ లీక్ ఆరోపణలు వచ్చాయని సర్ఫరాజ్ వివరించాడు..
* విమానం దిగగానే షాక్: నేను NCAలో ఉన్నప్పుడు డ్రెస్సింగ్ రూమ్ విషయాలను బయటకు చేరవేస్తున్నానంటూ వార్తలు వచ్చాయి. ఫ్లైట్ దిగి బయటకు రాగానే ఫోన్లు, మెసేజ్‌లు వచ్చాయి. సోషల్ మీడియాలో కూడా ఈ ప్రచారం బాగా జరిగింది. అసలు అలాంటి పని నేను ఎందుకు చేస్తా? నిజంగానే నేను లీక్ చేసి ఉంటే మళ్లీ ఇండియా-ఏ తరపున ఎలా ఎంపికయ్యేవాడిని? ఇటీవల శ్రీలంక టూరుకి కూడా ఎంపిక చేయరు కదా అని సర్ఫరాజ్ ప్రశ్నించాడు.
* కుటుంబం పడిన బాధ తట్టుకోలేకపోయా: జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా, భరించే శక్తి నాకుంది.. కానీ ఈ వివాదం వల్ల మా నాన్న బాధపడటం, నా భార్య ఏడవటం చూసి తట్టుకోలేకపోయాను.. అమ్మ, తమ్ముడు కూడా ఎంతో ఇబ్బంది పడ్డారు. ఆ కష్టకాలంలో కనీసం ఫోన్ చేసి మాట్లాడేవాళ్లు కూడా లేరు.. సోషల్ మీడియాలో చిన్న విషయం బయటకు వచ్చినా క్షణాల్లో పెద్ద వివాదంగా మారిపోతోందని సర్ఫరాజ్ ఖాన్ కన్నీరు పెట్టుకున్నాడు. ఆ సమయంలో తనకు మొదటగా ఫోన్ చేసింది టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అని వెల్లడించాడు.
ఫస్ట్ ఫోన్ చేసిందే హెడ్ కోచ్ గంభీర్:
* క్రికెట్ రాజకీయాలు పట్టించుకోవద్దు: ఆరోపణలు వచ్చిన రెండు రోజుల తర్వాత గంభీర్ సార్ నాకు ఫోన్ చేశారు. ఇలాంటి వాటిని పట్టించుకోవద్దని, ఆటపైనే దృష్టి పెట్టాలని చెప్పారు.. అవన్నీ క్రికెట్‌లో ఉండే రాజకీయాలేనని నాకు ధైర్యం చెప్పారని సర్ఫరాజ్ గుర్తు చేసుకున్నాడు.
* తండ్రికి భరోసా: మా నాన్న బాధపడుతున్నారని, భార్య ఏడుస్తోందని గంభీర్‌కు చెప్పినప్పుడు.. ఆయన నేరుగా తన తండ్రితోనే మాట్లాడారట. సర్ఫరాజ్ మంచి క్రికెటర్, అతడిని ప్రశాంతంగా క్రికెట్ ఆడనివ్వాలని మా ఫ్యామిలీకి చెప్పడంతో తమకు ఎంతో బలం చేకూరిందని సర్ఫరాజ్ తెలిపాడు.
🚨 SARFARAZ KHAN BROKE DOWN IN TEARS WHILE REVEALING HIS FAMILY'S FINANCIAL STRUGGLES DURING HIS CHILDHOOD. 💔 Sarfaraz Khan Said 🗣️: “When I was a child, my family was going through severe financial difficulties, and we lived in a small hut. I still remember hearing my father say one day that he had earned just one extra rupee. That moment stayed with me, and I decided that I wanted to become a cricketer because cricket offered the opportunity to earn a good living. At that time, I had heard that playing Under-16 cricket in Mumbai could earn a player ₹9,000. I made a promise to myself that I would become a successful cricketer one day and give my family a better life. With God's blessings, I went on to represent Mumbai and later India at the Under-19 level. Today, our financial situation has changed completely, and we even have our own house. Even now, I hand over all my earnings to my father and take only a monthly allowance from him. He has sacrificed so much for me, and he deserves every bit of it.” ❤️
— lndian Sports Network (@IS_Netwrk29) November 20, 2026
🚨 Sarfraz Khan talking about on Dressing Room leaks in BGT Tour 🚨 "I just landed from the flight. Suddenly, I started receiving calls and message. This started trending on social media. Suddenly the news came in. I was very hurt. If I should talk to whom ? Who should I talk to ? Who shouldn't ?". "Although there was nothing like that and if something like that had happened then I would have returned to India A & return in team India tour of Sri Lanka. So who said on social media and how ? It bad time for our family". "If you cannot spoil the work then spoil it's name and the work will get spoiled automatically". "I actually received the first call of Gautam Gambhir sir after two days. He told me, Sarfraz, This is all nonsense. It's all about politics. Don't get involved in this. And there is nothing like that. Just focus on cricket. Just focus on Cricket. I said sir, I will understand. He also spoke to my father. He said that you should discuss all the things. Don't worry Sarfraz is a good cricketer. First of all, he called me and said all this stuff is useless. Pay attention to this".
— VIKAS (@Vikas662005) November 20, 2026
