పీలో ఒక పక్క స్థానిక ఎన్నకలు పొలిటికల్ హీట్ రాజేస్తున్న క్రమంలో పీసీసీ చీఫ్ షర్మిల కూతురి పెళ్లి రాజకీయంగా దుమారం రేపుతోంది. షర్మిల కూతురి పెళ్లి వేదికగా బెంగళూరులోని యలహంక ప్యాలస్ జగన్ నిరాకరించడం ఒక కారణమైతే.. షర్మిల తన కూతురు పెళ్ళికి సీఎం చంద్రబాబును ఆహ్వానించడం వివాదానికి దారి తీసింది.వైఎస్ఆర్ తో నాకు ఏ సమస్య రాలేదు... పెళ్లికి ఆహ్వానిస్తే ఇంత నీచపు రాతలా..అని ప్రశ్నించారు చంద్రబాబు.
ఓ దినపత్రిక మంచి లవ్ స్టోరీస్ వార్తలు రాస్తోందని, వైసీపీ తీరు రాష్ట్రానికి హాని చేసేలా ఉందని ధ్వజమెత్తారు సీఎం చంద్రబాబు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా విధ్వంసమే వైసీపీ చరిత్ర అని, అందుకే వైసీపీని "గొడ్డలి పార్టీ" అని పిలవాల్సి వస్తోందని అన్నారు చంద్రబాబు
వైఎస్ షర్మిల కుమార్తె వివాహానికి తనను ఆహ్వానించడంపై సాక్షి పత్రికలో వచ్చిన కథనాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. ఇంటికి వచ్చి పెళ్లికి పిలిస్తే సొంత చెల్లిపైనే అసభ్యంగా రాస్తారా..? అని ప్రశ్నించారు. షర్మిల తన కుమార్తె పెళ్లికి తనను పిలిచారని... దీనిపై ఇంత నీచపు రాతలు అవసరమా..? అని మండిపడ్డారు చంద్రబాబు.
వైఎస్ఆర్ తో తనకేమీ సమస్య రాలేదని... రాజశేఖరరెడ్డి, తాను మంచి స్నేహితులమని.. రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత సంబంధాలు ఎప్పుడు చెడిపోలేదని అన్నారు చంద్రబాబు.ఆయన సీఎంగా ఉన్నప్పుడు షర్మిల, జగన్ ఇద్దరి పెళ్లిళ్లకూ తనను పిలిచారని... ఇద్దరి పెళ్లిళ్లకు హాజరయ్యానని.. సంబంధాలను ఇంత దారుణంగా కించపరుస్తారా..?అని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు.
