Vaibhav Sooryavanshi: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 (Rising Stars Asia Cup 2026) టోర్నీలో నేపాల్‌పై ఘన విజయం సాధించిన ఆనందంలో ఉన్న భారత్-ఏ (India A) ఆటగాళ్లకు మైదానం వెలుపల ఒక అనుభవం ఎదురైంది. భారత యువ సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) చిన్న పిల్లలతో సరదాగా ముచ్చటించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సీనియర్ ఆటగాడు అభిషేక్ శర్మ (Abhishek Sharma) పట్ల వైభవ్ చూపించిన గౌరవం, పిల్లలకు ఇచ్చిన క్యూట్ వార్నింగ్ క్రికెట్ అభిమానుల మనసులను గెలుచుకుంటోంది.
అభిషేక్ కాదు.. అభిషేక్ భయ్యా అని పిలవండి:
* దోహా వేదికగా జరిగిన భారత్-ఏ vs నేపాల్ మ్యాచ్ ముగిసిన తర్వాత కొందరు చిన్న పిల్లలు భారత ఆటగాళ్ల ఆటోగ్రాఫ్‌ల కోసం గుమిగూడారు.
* పిల్లల కేకలు: ఆటగాళ్లలో అభిషేక్ శర్మ ను చూడగానే ఆ చిన్నారులు ఉత్సాహంతో అభిషేక్.. అభిషేక్ అంటూ పేరు పెట్టి గట్టిగా పిలవడం స్టార్ట్ చేశారు.
* వైభవ్ స్వీట్ వార్నింగ్: అక్కడే ఉన్న 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ వెంటనే స్పందిస్తూ చిరునవ్వుతో ఆ పిల్లలను హెచ్చరించాడు. పెద్దవాళ్లను అలా పేరు పెట్టి పిలవకూడదని, అభిషేక్ భయ్యా అని పిలవాలని సరదాగా చెప్పుకొచ్చాడు. ఈ క్యూట్ సంభాషణ కెమెరాలో రికార్డు కావడంతో నెటిజన్లు వైభవ్ సంస్కారాన్ని, అతడి మాటల్లోని అమాయకత్వాన్ని ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
దోహాలో భారత్-ఏ విజయం:
ఈ టోర్నమెంట్లో భారత్-ఏ జట్టు నేపాల్‌పై 306 రన్స్ తేడాతో రికార్డు లిస్ట్-ఏ (List A) విజయాన్ని నమోదు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా -ఏ జట్టులో కెప్టెన్ తిలక్ వర్మ (107), వికెట్ కీపర్ కుమార్ కుశాగ్ర (117) అద్భుత సెంచరీలతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 332/9 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 333 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్, భారత పేసర్లు ప్రిన్స్ యాదవ్ (5/6), హర్షిత్ రాణా (4/16) ధాటికి కేవలం 26 పరుగులకే ఆలౌటైంది.
Vaibhav correcting these cutu fans saying “Abhishek bhayya, Abhishek nahi” omgggggg their bond is soooooooooooo cuteeeeeeee 😭😭 https://t.co/taG0C36uZg
— Megha || Abhishek & bangtan ✨ (@abhiilysm04) November 21, 2026
