కౌలూన్: హాంకాంగ్ ఓపెన్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో ఇండియా షట్లర్ల పోరాటం ముగిసింది. శనివారం జరిగిన మెన్స్ సింగిల్స్‌లో లక్ష్యసేన్ 13–21, 13–21తో అండర్స్ అంటోన్సెన్ (డెన్మార్క్) చేతిలో ఓడాడు. గత రెండు వారాల్లో హైలో ఓపెన్, కుమమోటో మాస్టర్స్ టైటిల్స్ నెగ్గి జోరుమీదున్న లక్ష్య ఈ మ్యాచ్‌లో అలసటతో నెమ్మదిగా కదిలాడు.
తొలి గేమ్‌లో 8–8 వరకు పోటీ ఇచ్చినా ఆ తర్వాత అంటోన్సెన్ దూకుడు ముందు నిలవలేకపోయాడు. రెండో గేమ్‌లోనూ అనేక తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. మెన్స్ డబుల్స్ సెమీస్‌లో సాత్విక్–చిరాగ్ జోడీ 18–21, 19–21తో మాన్ వీ చోంగ్–టీ కై వున్ (మలేసియా) చేతిలో కంగుతిన్నారు. హోరాహోరీగా సాగిన పోరులో ఇండియన్ ద్వయం కీలక టైమ్‌లో చేసిన తప్పిదాలు విజయావకాశాలను దెబ్బతీశాయి.
