స్క్రిప్ట్ బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ది.. ప్రజెంటేషన్ బీజేపీది : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

స్క్రిప్ట్ బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ది.. ప్రజెంటేషన్ బీజేపీది : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: దేశమంతా బత్తాయిలు ఆరెంజ్ కలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంటే, తెలంగాణలో మాత్రం అవి పింక్ రంగులో ఉంటాయని   బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను ఉద్దేశించి  కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో గాంధీ భవన్‌‌‌‌‌‌‌‌లో మీడియాతో ఎంపీ చామల మాట్లాడారు. రాష్ట్రంలో ఆట మొదలైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. 

కేటీఆర్, హరీశ్ రావు వెనుక ఉండి డబ్బింగ్ చెబుతుంటే, కిషన్ రెడ్డి బయటకు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో స్క్రిప్ట్ బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ది అయితే, ప్రజెంటేషన్ బీజేపీది అని ఆయన విమర్శించారు.