హైదరాబాద్, వెలుగు: ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ హైదరాబాద్లో నవంబర్ 25 నుంచి 27 వరకు 18వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో 2026 నిర్వహించనుంది. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో నిర్వహించే ఈ అంతర్జాతీయ ప్రదర్శనను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని అసోసియేషన్ తెలిపింది.
125 దేశాల నుంచి 51 వేల మందికి పైగా పౌల్ట్రీ రంగ ప్రతినిధులు, నిపుణులు, వ్యాపారవేత్తలు హాజరవుతారని అంచనా. 550కి పైగా కంపెనీలు తమ ఉత్పత్తులు, టెక్నాలజీలను ప్రదర్శిస్తాయి. కోళ్ల ఆరోగ్యం, యంత్రాలు, హేచరీలు, పోషణ, వ్యాక్సినేషన్, ఫీడ్ నిర్వహణ, ఆటోమేషన్, ఏఐ వాడకం, సుస్థిర ఉత్పత్తి విధానాలపై చర్చలు జరగనున్నాయని నిర్వాహకులు తెలిపారు.
