నవంబర్ 26న మద్దిమడుగులో సేవాలాల్ ఆలయానికి సీఎం శంకుస్థాపన

నవంబర్ 26న మద్దిమడుగులో సేవాలాల్ ఆలయానికి సీఎం శంకుస్థాపన

హైదరాబాద్, వెలుగు: నాగర్‌‌‌‌‌‌‌‌కర్నూల్ జిల్లా మద్దిమడుగులో సంత్ సేవాలాల్ మహారాజ్ గర్భగుడి నిర్మాణానికి ఈ నెల 26న సీఎం రేవంత్ శంకుస్థాపన చేయనున్నారని కాంగ్రెస్ ఎస్టీ ప్రజాప్రతినిధులు ప్రకటించారు. శనివారం సీఎల్పీ కార్యాలయంలో ఎంపీ బలరాం నాయక్, విప్ రాంచంద్రు నాయక్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎమ్మెల్యేలు బాలు నాయక్, మురళీ నాయక్ మాట్లాడారు. 

మద్దిమడుగు ఆంజనేయ స్వామి విగ్రహం పక్కనే 20 ఎకరాల్లో సేవాలాల్ విగ్రహం, ఆలయాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. ఇందుకోసం సీఎం రూ.200 కోట్లు కేటాయించగా, ఇప్పటికే రూ.38 కోట్లు విడుదలయ్యాయని చెప్పారు.