ఏఎస్బీఎల్ కొత్త ప్రాజెక్ట్ ' లెగసీ'.. ఒక్కరోజులో రూ.800 కోట్ల సేల్స్

ఏఎస్బీఎల్ కొత్త ప్రాజెక్ట్ ' లెగసీ'.. ఒక్కరోజులో రూ.800 కోట్ల సేల్స్

న్యూఢిల్లీ: రియల్టీ కంపెనీ ఏఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్​ఆర్​టీసీ క్రాస్​రోడ్​లో  లెగసీ పేరుతో మొదలుపెట్టిన లగ్జరీ రెసిడెన్షియల్​ ప్రాజెక్టుకు భారీ స్పందన వచ్చినట్టు ప్రకటించింది. తొలిరోజే రూ.800 కోట్ల విలువైన ఇళ్ల విక్రయాలను సాధించినట్లు తెలిపింది.  నిర్మాణం పూర్తయ్యే వరకు ఈఎంఐ చెల్లింపులు అవసరం లేని ప్రత్యేక ఆఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కూడా అందిస్తోంది.

 నిర్మాణ కాలంలో లోన్​పై వడ్డీని సంస్థే భరిస్తుంది. సుమారు 7.97 ఎకరాల్లో జీ+50 అంతస్తులతో 3 టవర్లు నిర్మించనున్నారు. ఇందులో 1,970 నుంచి 3,015 చదరపు అడుగుల విస్తీర్ణంలో 3, 4 బీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే ఫ్లాట్లు ఉంటాయి. ధరలు రూ.1.99 కోట్ల నుంచి ప్రారంభమవుతున్నాయి. 73.25శాతం ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 74,000 చదరపు అడుగుల క్లబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 50కి పైగా సదుపాయాలు ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి.