రాహుల్, పంత్ సెంచరీ: 720/9 వద్ద భారత్ డిక్లేర్: కివీస్‌కు 352 రన్స్ ఆధిక్యం

రాహుల్, పంత్ సెంచరీ: 720/9 వద్ద భారత్ డిక్లేర్: కివీస్‌కు 352 రన్స్ ఆధిక్యం

IND vs NZ Test: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా (Team India) బ్యాటర్లు చరిత్ర సృష్టించారు. బేసిన్ రిజర్వ్ వేదికగా నాలుగో రోజు ఆటలో భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్ల నష్టానికి 720 పరుగుల దగ్గర డిక్లేర్ చేసింది. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు (368) కంటే భారత్ ఏకంగా 352 పరుగుల భారీ ఆధిక్యంలో నిలిచింది. ఈ ఇన్నింగ్స్‌తో కివీస్ గడ్డపై ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగా టీమిండియా సరికొత్త రికార్డు నెలకొల్పింది.

న్యూజిలాండ్ గడ్డపై ఆల్-టైమ్ రికార్డు బద్దలు:

టీ విరామానికి సుమారు గంట ముందు (ధ్రువ్ జురెల్ ఔటైన వెంటనే) భారత్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. 

* న్యూజిలాండ్‌లో అత్యధిక స్కోరు: భారత్ చేసిన 720/9, న్యూజిలాండ్ గడ్డపై ఏ జట్టుకైనా అత్యధిక టెస్టు స్కోరు. 2019లో హామిల్టన్‌లో బంగ్లాదేశ్‌పై న్యూజిలాండ్ చేసిన 715/6 డిక్లేర్డ్ రికార్డును భారత్ బద్దలు కొట్టింది.

* కివీస్‌పై అత్యధిక స్కోరు: న్యూజిలాండ్‌పై అత్యధిక టెస్టు స్కోరు రికార్డు కూడా టీమిండియా సొంతమైంది. 1995లో వెల్లింగ్టన్‌లోనే వెస్టిండీస్ చేసిన 660/5 డిక్లేర్డ్ రికార్డును టీమిండియా అధిగమించింది.

* రాహుల్, పంత్ శతకాలు: కేఎల్ రాహుల్ (136), రిషభ్ పంత్ (128) అద్భుత సెంచరీలతో చెలరేగారు. కివీస్ బౌలర్లలో గ్లెన్ ఫిలిప్స్ (3/154) అత్యధిక వికెట్లు తీశాడు.

టెస్టు క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డులు ఇవే: 

* వరుసగా ఆరు 50+ భాగస్వామ్యాలు: మొదటి ఆరు వికెట్లకు కనీసం 50 అంతకంటే ఎక్కువ పరుగుల భాగస్వామ్యాలు నమోదు కావడం టెస్టు చరిత్రలో 4వ సారి.. గతంలో ఆస్ట్రేలియా (1960-61), పాకిస్థాన్ (2015), భారత్ (2023 vs ఆసీస్) ఈ ఘనత సాధించగా, ఇప్పుడు వెల్లింగ్టన్‌లో మరోసారి చేసి ఈ ఫీట్‌ను రెండుసార్లు సాధించిన తొలి జట్టుగా ఇండియన్ టీమ్ నిలిచింది.

* టాప్-5 బ్యాటర్లందరూ 80+ స్కోర్లు: భారత టాప్-5 బ్యాటర్లలో ప్రతి ఒక్కరూ 80 అంతకంటే ఎక్కువ రన్స్ చేయడం టెస్టు చరిత్రలో రెండోసారి మాత్రమే జరిగింది. (2014లో అబుదాబిలో న్యూజిలాండ్‌పై పాకిస్థాన్ టాప్-5 ప్లేయర్స్ 80+ స్కోర్లు చేశారు).

* భారత్ మూడో అత్యధిక టెస్టు స్కోరు: 720/9 భారత్‌కు టెస్టుల్లో మూడో అత్యధిక స్కోరు. (759/7d vs ఇంగ్లండ్ - చెన్నై 2016; 726/9d vs శ్రీలంక - బ్రబౌర్న్ 2009 తర్వాత).

* 700+ స్కోర్లలో రెండో స్థానం: టెస్టుల్లో భారత్‌కు ఇది 5వ 700+ స్కోరు. శ్రీలంక (7) అగ్రస్థానంలో ఉండగా, భారత్ (5) రెండో స్థానంలో నిలిచింది.