హైదరాబాద్, వెలుగు: జాతీయ ఏరోబిక్ జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ యువ జిమ్నాస్ట్‌లు కోరం ధ్రువ్ రుద్రాంచ్ రెడ్డి–సూర్యగారి ఇష్టా రెడ్డి రాణించారు. రాజస్తాన్‌లోని జైపూర్‌లో శుక్రవారం జరిగిన అండర్–14 మిక్స్‌డ్ పెయిర్ విభాగంలో ధ్రువ–ఇష్టా జోడీ ఆరో ప్లేస్‌లో నిలిచింది. అండర్–14 యూత్ విభాగంలో ధ్రువ్ పదో స్థానం సాధించాడు.
దేశ వ్యాప్తంగా నాణ్యమైన జిమ్నాస్ట్‌లు బరిలోకి దిగిన ఈ పోటీల్లో తెలంగాణ ప్లేయర్లు సత్తా చాటడం అభినందనీయమని వీజే జిమ్నాస్టిక్స్ అకాడమీ పేర్కొంది. వీళ్ల విజయం వెనుక అకాడమీ హెడ్ కోచ్ డాక్టర్ కోరం విజయపాల్ రెడ్డి, ఇతర కోచ్‌ల కృషి ఎంతో ఉందని కొనియాడింది.
