ఇంగ్లండ్తో తొలి టీ20 ఆసీస్ దే తొలి టీ20

 ఇంగ్లండ్తో  తొలి టీ20 ఆసీస్ దే తొలి టీ20

మెల్‌‌బోర్న్‌‌: నిఖిల్‌‌ చౌదరి (66, 2/21) ఆల్‌‌రౌండ్‌‌తో చూపెట్టడంతో.. ఇంగ్లండ్‌‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌‌లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో గెలిచింది. ఫలితంగా ఐదు మ్యాచ్‌‌ల సిరీస్‌‌లో హోమ్‌‌ టీమ్‌‌ 1–0 ఆధిక్యంలో నిలిచింది. టాస్‌‌ ఓడిన ఇంగ్లండ్‌‌ 20 ఓవర్లలో 187/9 స్కోరు చేసింది. హ్యారీ బ్రూక్‌‌ (65), టామ్‌‌ బాంటన్‌‌ (39), జోర్డాన్‌‌ కాక్స్‌‌ (27), సామ్‌‌ కరన్‌‌ (21) రాణించారు. 

నిఖిల్‌‌తో పాటు జాక్‌‌ ఎడ్వర్డ్స్‌‌ 2 వికెట్లు తీశాడు. తర్వాత ఆస్ట్రేలియా 19.5 ఓవర్లలో 191/7 స్కోరు చేసింది. మిచెల్‌‌ మార్ష్‌‌ (37), సామ్‌‌ హార్పర్‌‌ (32), జాక్‌‌ ఎడ్వర్డ్స్‌‌ (25 నాటౌట్‌‌), టిమ్‌‌ డేవిడ్‌‌ (20) కీలక పాత్ర పోషించారు. విల్‌‌ జాక్స్‌‌ 2 వికెట్లు పడగొట్టాడు. నిఖిల్‌‌కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది.