హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా చెక్ బౌన్స్ కేసుల పరిష్కారం కోసం శనివారం రెండో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించారు. మొత్తం 214 లోక్ అదాలత్ బెంచీలను ఏర్పాటు చేసి 3,727 కేసులను పరిష్కరించారు. వీటి విలువ రూ.39.89 కోట్లుగా ఉంది. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ప్యాట్రన్ ఇన్ చీఫ్ మార్గదర్శకత్వంలో ఈ ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించారు.
పెండింగ్‌లో ఉన్న నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టం కింద నమోదైన చెక్ బౌన్స్ కేసులను పరిష్కరించడమే లక్ష్యంగా కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో జిల్లా న్యాయమూర్తులు, న్యాయ సేవాధికార సంస్థల అధికారులు సమన్వయంతో పనిచేశారు.
